స్నేహితులే నిర్మాతలుగా... | Allu Arjun Brings Friends on Board as Co-Producers for AA23 | Sakshi
Sakshi News home page

స్నేహితులే నిర్మాతలుగా...

Aug 3 2026 12:23 AM | Updated on Aug 3 2026 12:23 AM

Allu Arjun Brings Friends on Board as Co-Producers for AA23

‘‘నిజమైన విజయం అంటే మన స్నేహితులను కూడా మనతో పాటు ముందుకు తీసుకెళ్లడమే’’ అంటుంటారు. తాజాగా తన స్నేహితులకు సహ నిర్మాతలుగా అవకాశం కల్పించి, ఈ విషయాన్ని నిజం చేశారు అల్లు అర్జున్‌. హీరో అల్లు అర్జున్‌ తాజా చిత్రం ‘ఏఏ23’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రానికి ఈ హీరో ఫ్రెండ్స్‌ భాగస్వాములైన విషయాన్ని స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం వెల్లడించారు.

అల్లు అర్జున్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూ పొందనున్న సినిమా ‘ఏఏ23’ (వర్కింగ్‌ టైటిల్‌). మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకి అల్లు అర్జున్‌ స్నేహితులు బన్నీ వాస్‌ (ఆల్రెడీ పలు చిత్రాలు నిర్మించారు), సందీప్‌ రామినేని, నటరాజ్, స్వాతి (అల్లు అర్జున్‌ కజిన్‌)లు  సహ–నిర్మాతలుగా వ్యహరించనున్నారు.

 ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలని టీమ్‌  ప్లాన్‌ చేస్తోందని తెలిసింది. మరోవైపు ప్రస్తుతం ‘రాకా’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌. అట్లీ దర్శకత్వంలో రూ పొందుతున్న ఈ సినిమాను కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement