పూజా హెగ్డే, దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘శ్రీ శ్రీ’. రవి నెలకుదిటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల ఫారిన్‌లో మొదలైన ఈ సినిమా కీలక షెడ్యూల్ ముగిసింది.
‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫారిన్ షెడ్యూల్‌లో అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా ఉంటాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.


