ఏ సమయం కూడా ఒకేలా ఉండదు | Samantha Prabhu Shares New Photos & Philosophical Post: "Time Never Stays Same" | Sakshi
Sakshi News home page

ఏ సమయం కూడా ఒకేలా ఉండదు

Aug 3 2026 1:40 AM | Updated on Aug 3 2026 12:06 PM

Samantha Ruth Prabhu recently took to Instagram to share her new photos

‘‘ఏ సమయం కూడా ఒకేలా ఉండదు’’ అంటున్నారు సమంత. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమాతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారామె. ప్రస్తుతం సమంత గర్భవతి. దాంతో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. గత ఏడాది డిసెంబరు 1న దర్శక–నిర్మాత రాజ్‌ నిడిమోరుతో సమంత వివాహం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఇన్‌స్టా వేదికగా సమంత తన కొత్త ఫొటోలను షేర్‌ చేశారు. 

‘‘ఏ సమయం కూడా ఒకేలా ఉండదు. కొన్ని సమయాలు మనల్ని ఎదురు చూడమని సూచిస్తాయి. మరికొన్ని మనల్ని పోరాటం చేయమని చెబుతాయి. ఇంకొన్ని సమయాలు కొన్నింటిని వదిలేయమని సంకేతాలు ఇస్తాయి. మనకు ఏ సమయం కావాలో ఎంచుకునే అవకాశం మన చేతుల్లో ఉండదు. అయితే ఆ సమయాల్లో మనం ఎలా జీవిస్తున్నాము అన్నదే ముఖ్యం’’ అంటూ తన కొత్త ఫొటోలకు క్యాప్షన్‌ జోడించారు సమంత. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement