ప్రతి ఏడాది ప్రసారమయ్యే 'బిగ్‌బాస్' షోకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో కంటెంట్, గొడవలపై విమర్శలు వస్తుంటాయి. అదే టైంలో చూసేవాళ్లు రోజూ చూస్తూనే ఉంటారు. ఎనిమిది సీజన్ల వరకు సెలబ్రిటీలకే ఎక్కువగా అవకాశమిచ్చారు. గతేడాది టెలికాస్ట్ అయిన 9వ సీజన్ నుంచి మాత్రం సామాన్యులకు కూడా హౌస్‌లో అడుగుపెట్టే ఛాన్స్ ఇచ్చారు. దీనికి అగ్నిపరీక్ష పేరుతో పోటీ కూడా నిర్వహించారు. ఈసారి అగ్నిపరీక్షకు రంగం సిద్ధమైంది. ఈ శనివారం నుంచి గేమ్ మొదలవనుంది. ఈ క్రమంలోనే ప్రోమో వదిలారు.
(ఇదీ చదవండి: 'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్)
ఈసారి అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి 70 మంది అగ్నిపరీక్షలో పోటీపడబోతున్నారు. రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే ముగ్గురు బాగా హైలెట్ అయ్యారు. వీళ్లలో ఒక అమ్మాయి రైతుగా ఊరిలో పనిచేస్తూ పల్లె పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు తొలిదశలో గ్రీన్ సిగ్నల్ లభించింది. అలానే తెలుగుని వెనక నుంచి ముందుకు తిప్పి రాసే మరో అమ్మాయి కూడా ఆకట్టుకుంది.
చివరగా ఓ కుర్రాడు.. జడ్జి సీటులో కూర్చున్న 4వ సీజన్ విజేత అభిజిత్‌కే కౌంటర్ వేశాడు. గెలిచిన తర్వాత రెండేళ్లు ఎక్కడా కనిపించకుండా పోయారు అని పరువు తీసేలా మాట్లాడాడు. దీంతో హర్ట్ అయిన అభిజిత్.. ఏం మాట్లాడుతున్నావ్? మాకేం పనిలేదని అనుకుంటున్నావా? అని సీరియస్ అయ్యాడు. ఇకపోతే వచ్చే నెల తొలివారం నుంచి 10వ సీజన్ మొదలయ్యే అవకాశముంది.
(ఇదీ చదవండి: మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్)


