'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్ | DC Movie Wamiqa Gabbi Gifts iPhone 17 Co Actor | Sakshi
Sakshi News home page

Wamiqa Gabbi iPhone: కలిసి నటించాడు.. ఐఫోన్ అందుకున్నాడు

Aug 12 2026 11:07 AM | Updated on Aug 12 2026 11:16 AM

DC Movie Wamiqa Gabbi Gifts iPhone 17 Co Actor

రీసెంట్ టైంలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయిన సినిమా 'డిసి'. డైరెక్టర్ లోకేశ్ కనగరాజు హీరోగా నటించిన చిత్రమిది. ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి అద్భుతాలు చేస్తోంది. తెలుగులోనూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తొలి వీకెండ్‌లోనే రూ.50 కోట్ల కలెక్షన్స్ సాధించిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇందులో నటించిన హీరోయిన్ వామికా గబ్బి కూడా తెగ ట్రెండ్ అయిపోతోంది.

(ఇదీ చదవండి: క్రేజీ న్యూస్.. 'డిసి' సీక్వెల్?)

వామిక ఇప్పుడు ఓ మంచిపని చేసి నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది. ఇందులో లోకేశ్ కనగరాజు, వామిక హీరోహీరోయిన్లుగా నటించగా.. వీళ్లతో పాటు పలువురు సహాయ పాత్రలు చేశారు. వాళ్లలో జవహర్ శక్తి అనే నటుడు ఒకడు. షూటింగ్ సందర్భంగా వామికతో ఇతడికి మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె తనకు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మొబైల్ గిఫ్ట్ ఇచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

వామిక విషయానికొస్తే..2007 నుంచి ఇండస్ట్రీలో ఉంది. 2015లో వచ్చిన 'భలే మంచిరోజు' సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే ఇన్నేళ్లయినా ఓ మాదిరి గుర్తింపు మాత్రమే ఉంది. ఇప్పుడు 'డిసి' హిట్‌తో ఈమెకు బాగానే కలిసొచ్చేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అడివి శేష్ 'గూఢచారి 2'లో హీరోయిన్‌గా చేస్తోంది. రిషభ్ శెట్టి 'జై హనుమాన్'లోనూ ఈమెని కీలక పాత్ర కోసం తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇవి గనక నిజమై సక్సెస్ అందుకుంటే ఈ బ్యూటీకి సౌత్‌లో మరిన్ని ఆఫర్స్ రావడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: లోకేశ్‌ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement