కాంబో రిపీట్.. ఆ హీరోతో త్రిష సినిమా? | Trisha Acts With Karthi New Movie | Sakshi
Sakshi News home page

Trisha: 'పొన్నియిన్ సెల్వన్' కాంబోలో మరో మూవీ?

Aug 12 2026 10:19 AM | Updated on Aug 12 2026 10:58 AM

Trisha Acts With Karthi New Movie

మణిరత్నం తీసిన భారీ బడ్జెట్ సినిమా 'పొన్నియిన్‌ సెల్వన్‌'. ఇందులో యువరాణి కుందవిగా త్రిష, , వల్లవరాయగా కార్తీ నటించారు. మూవీలో ఈ జంట చూడముచ్చటగా అనిపించింది. రీఎంట్రీలో ఈ చిత్రం త్రిషకు బాగా పనికొచ్చింది కూడా.  ఇకపోతే ఇప్పుడు మరోసారి కార్తీ-త్రిష జంటగా నటించేందుకు సిద్ధమయ్యారట.

కార్తీ 'సర్దార్‌ 2' వచ్చే నెల 10న థియేటర్లలోకి రానుంది. ఇతడు చేస్తున్న మరో మూవీ మార్షల్‌. దీని షూటింగ్ కూడా పూర్తయింది. రీసెంట్‌గానే మరో రెండు మూడు చిత్రాలని కార్తీ కమిట్‌ అయ్యాడు. అందులో ఒకటి దర్శకుడు మోహన్‌ రాజాతో ప్రాజెక్ట్. తనీ ఒరువన్‌ ,వేలైక్కారన్‌ లాంటి హిట్ మూవీస్ తీసిన మోహన్‌ రాజా.. చివరగా చిరంజీవితో 'గాడ్ ఫాదర్' తీశాడు. ఇకపోతే కార్తీ-మోహన్ రాజా మూవీలో తొలుత నయనతార నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆమె కాల్‌ షీట్స్‌ సర్దుబాటు కాలేదని దీంతో త్రిషని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement