టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే... | Nayanthara top remuneration in Toxic movie | Sakshi
Sakshi News home page

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే...

Aug 12 2026 6:13 AM | Updated on Aug 12 2026 6:13 AM

Nayanthara top remuneration in Toxic movie

దక్షిణాది లేడీ సూపర్‌ స్టార్‌గా పేర్కొంటున్న నయనతార సినిమాల జయాపజయాలకు అతీతంగా అంతకంతకూ స్టార్‌డమ్‌ను పెంచుకుంటున్న అరుదైన హీరోయిన్లలో ఒకరు. ఇటు సినిమా రెమ్యునరేషన్‌ విషయంలోనూ అటు ప్రకటనలకు వసూలు చేసే మొత్తాల్లోనూ కూడా నయనతార చాలా మంది హీరోయిన్ల కంటే ముందుంటున్నారు. తాజాగా ‘టాక్సిక్‌’ సినిమాలో నటించిన నయనతార ఆ సినిమాలో అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 ఆ సినిమాలో గ్లామర్‌ సెన్సేషన్‌గా నిలిచినది  కియారా అద్వాని కాగా ఆమెకు రూ. 12 నుంచి 15 కోట్లు మధ్య పారితోషికం అందిందని, నయనకు మాత్రం రూ. 18కోట్ల దాకా ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించిన రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి వంటి తారల రెమ్యునరేషన్‌ రూ. 3 కోట్లు లోపే ఉన్నట్టు సమాచారం. దీంతో ‘టాక్సిక్‌’లో నటించిన హీరోయిన్లలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకున్న తారగా నయనతార నిలిచారు.

యాడ్స్‌లోనూ టాప్‌... 
సినిమాలతో పాటు ప్రచార చిత్రాల్లోనూ నయనతార దూసుకువెళుతున్నారు. తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థతో ఆమె ప్రచార ఒప్పందం చేసుకున్నారు. అంతర్జాతీయంగా పేరొందిన ఈ సంస్థ దక్షిణాదిలో తమ కార్యకలాపాల విస్తరణకు నయనతార బెస్ట్‌ ఆప్షన్‌గా ఎంచుకోవడం విశేషం. ఇలాగే గతంలో కూడా ఓ శాటిలైట్‌ డిష్‌ బ్రాండ్‌ కోసం చేసిన 50 సెకన్ల వాణిజ్య ప్రకటనకు ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేయడం ద్వారా నయనతార వార్తల్లో నిలిచారు. అంటే ఒక్క సెకనుకు రూ. 10 లక్షలన్న మాట. రెండు రోజుల పాటు నాలుగు దక్షిణ భారత భాషలలో రూపొందిన ఆ ప్రతిష్టాత్మక ప్రకటన పాన్‌–సౌత్‌ స్టార్‌గా ఆమె భారీ మార్కెట్‌ విలువను సుస్థిరం చేసింది. 

చె΄్పాలంటే నయనతార ఏజ్‌ ఫార్టీ ప్లస్‌. మామూలుగా ఈ ఏజ్‌లో ఉన్న ఏ నటికి అయినా దాదాపు అక్క, వదిన పాత్రలే వస్తుంటాయి. నయనతారలాంటి ఇద్దరు ముగ్గురు తారలు మాత్రం హీరోయిన్లుగా సినిమాల్లో దూసుకెళ్లడంతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ విజృంభిస్తుంటారు. ఈ ఇద్దరు ముగ్గురు తారల్లో నయనతారదే అగ్రస్థానం అని చెప్పొచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement