'కాష్మోరా' మ్యాజిక్ రిపీట్.. కార్తీ - నయనతార కాంబోలో భారీ చిత్రం! | Nayanthara Likely To Reunite With Karthi In Mohan Raja New Film, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

'కాష్మోరా' మ్యాజిక్ రిపీట్.. కార్తీ - నయనతార కాంబోలో భారీ చిత్రం!

Aug 6 2026 9:03 AM | Updated on Aug 6 2026 9:42 AM

Nayanthara Play Key Role In Karthi, Mohan Raja New Film

కొన్ని కాంబినేషన్లు మొదటి నుంచి ఆసక్తిని క్రియేట్‌ చేస్తాయి. చిత్రాలకు హైప్‌ తీసుకొస్తాయి. అలా తాజాగా నటుడు కార్తీ హీరోగా నటించడానికి సిద్ధం అవుతున్న చిత్రం ఫేమ్‌ థింగ్‌ స్పెషల్‌గా మారుతోంది. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో సర్ధార్‌–2 ఒకటి . కార్తీ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబు అవుతోంది. దీంతో పాటూ మార్షల్‌ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. అంతేకాకుండా మరో మూడు చిత్రాలు కమిట్‌ అయ్యారు. అందులో తెలుగు చిత్రం హిట్‌ –3 కూడా ఉంది. 

కాగా తాజాగా మోహన్‌ రాజా దర్శకత్వం ఒక చిత్రం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణన్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం గురించే కోలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతోంది.  ముఖ్యంగా ఈ చిత్రంలో నటించే కథానాయకి ఎవరన్న విషయంలో తాజాగా నటి నయనతార పేరు వెలుగులోకి వచ్చింది. 40 వసంతాలు దాటినా అగ్ర కథానాయికిగా రాణిస్తున్న ఈ పాన్‌ ఇండియా భామను అటు ఉత్తరాది, ఇటు దక్షిణాదిలోనూ భారీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. హిందీలో ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌కు జంటగా ఒక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె ఒక తెలుగు చిత్రాన్ని వదులు కున్నట్లు ప్రచారం జరిగింది.

కాగా తమిళంలో నటిస్తున్న మూకుత్తి అమ్మన్‌– 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇవి కాక రాకాయి, మన్నాంగట్పి, మలయాళ చిత్రం డియర్‌ స్టూడెంట్‌ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అదే విధంగా కవిన్‌కు జంటగా నటిస్తున్న హాయ్‌ చిత్రం షూటింగ్‌ ను పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక యష్‌తో కలిసి నటించిన టాక్సిక్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. విశేషం ఏమిటంటే ఇందులో ఈమె ప్రతినాయకిగా నటించినట్లు సమాచారం. ఇకపోతే కార్తీతో కలిసి ఇంతకు ముందు కాష్మోరా చిత్రంలో నటించిన నయనతార ఇప్పుడు మరోసారి ఆయనతో జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాక ముందే ఈ చిత్రంపై ఆసక్తి నెలకుంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement