జ‌క్క‌న్న ఇదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తారా..! | Mahesh Babu Birthday Surprise: What Is Varanasi Director Rajamouli Planning? | Sakshi
Sakshi News home page

మహేశ్‌ బాబు బ‌ర్డే బ్లాస్ట్ ఉంటుందా..!

Aug 5 2026 5:18 PM | Updated on Aug 5 2026 5:31 PM

Mahesh Babu Birthday Surprise: What Is Varanasi Director Rajamouli Planning?

మహేశ్‌ బాబు అభిమానులు  ఆగస్టు 9 కోసం  లెక్కలు వేసుకుంటున్నారు.  ఆరోజు సూప‌ర్‌స్టార్ పుట్టిన రోజు కావ‌డ‌మే విశేషం.  ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా  ఏదో ఒక  అప్‌డేట్ వస్తుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న‘వార‌ణాసి’ చిత్రం నుంచి ఏ  చిన్న అప్‌డేట్ వచ్చినా చాలు అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

రాజమౌళి సినిమాలంటే ప్రచారంలోనూ ప్రత్యేక వ్యూహమే ఉంటుంది. షూటింగ్‌కు సంబంధించిన విషయాలను చివరి వరకు గోప్యంగా ఉంచడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయినప్పటికీ హీరోల పుట్టినరోజుల సందర్భంగా అభిమానులను నిరాస‌ప‌రిచిన‌ సందర్భాలు కూడా చాలా తక్కువ. అయితే ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ మహేశ్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా కనీసం ఏదో ఒక అప్‌డేట్ ఉంటుంద‌నే టాక్‌ ఫిల్మ్‌ సర్కిల్‌ బలంగా వినిపిస్తుంది.  

ఎందుకంటే..గతంలో  ఎన్టీఆర్, రామ్‌చరణ్ పుట్టినరోజులకు ‘ఆర్‌ఆర్‌ఆర్ ’నుంచి ప్రత్యేక వీడియోలు విడుదల చేసిన  జక్కన్న.. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారా? అని అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

అయితే ఇప్ప‌టికే  ప్రియంకా చోప్రా పుట్టిన రోజు సంద‌ర్భంగా రాజ‌మౌళి  ఎక్స్ వేదికగా ఆస‌క్తిని రేకేత్తించే ఫొటోల‌ను రివీల్‌చేశారు. సినిమా టైట‌ల్ రివీల్ చేస్తూ వార‌ణాసి నుంచి విడుద‌లైన వీడియో , మ‌హేశ్‌ బాబు రుద్ర‌గా క‌నిపించిన తీరు అభిమానుల్లో హోరెక్కించింది. అయితే ఇప్పుడు మహేశ్‌ బాబు బర్త్‌డేకు  ప్రత్యేక పోస్టర్‌తో సరిపెడతారా?  లేదా టీజర్‌ రిలీజ్‌ చేస్తారా? అనే  సస్పెన్స్‌కు తెరపడాలంటే..  ఆగస్టు 9 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement