'సినిమాల్లో ఛాన్స్.. దయచేసి అమ్మాయిలు రావొద్దు' | Social Media Influencer comments on Cinema industry chances | Sakshi
Sakshi News home page

Casting Couch: 'కమిట్‌మెంట్‌ ఇస్తేనే ఛాన్స్.. మూడోసారి అదే రిపీట్'

Aug 5 2026 5:04 PM | Updated on Aug 5 2026 5:14 PM

Social Media Influencer comments on Cinema industry chances

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సినీ రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నామని చాలామంది నటీమణులు బయటికి చెబుతుంటారు. ఏదో ఒక సందర్భంలో తాము కూడా క్యౌస్టింగ్ కౌచ్‌కు గురైనట్లు పలువురు స్టార్స్ సైతం ఈ విషయంపై గతంలో మాట్లాడారు. అలా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవాళ్లకు సైతం ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి.

తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయరన్సర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. సీరియల్స్‌, ఫోక్ సాంగ్స్‌లో అవకాశాల కోసం తాను హైదరాబాద్‌కు వచ్చానని తెలిపింది. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నాయని.. కానీ కమిట్‌మెంట్‌ ఇస్తేనే ఛాన్స్ ఇస్తారని ఓపెన్‌గా చెప్పేసింది. మహిళలు సినీరంగంలో వచ్చారంటే కమిట్‌మెంట్‌ లేకుండా జరగదని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఛాన్స్ కోసం మూడోసారి హైదరాబాద్‌కు వచ్చానని.. మళ్లీ అదే రిపీట్ అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా మన ఇన్ స్టా రీల్స్‌ కానీ.. యూట్యూబ్ ఛానల్ కానీ చూసి సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటే అస్సలు నమ్మొద్దని మహిళలకు విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇన్‌ఫ్ల్యూయన్సర్‌ వీడియోలో మాట్లాడుతూ.. 'మన ఇన్‌స్టా వీడియోస్ చూసి సీరియల్స్, సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌లో ఆఫర్ ఇస్తామంటే నమ్మి హైదరాబాద్‌కు రావొద్దు. ఎందుకంటే ఇక్కడ కమిట్‌మెంట్‌ తప్పనిసరి. అది లేనిదే అమ్మాయికీ అవకాశం ఇవ్వరనేది తెలిసిపోయింది. ఒక్కసారి కాదు.. నాకు అలా మూడుసార్లు జరిగింది. నాకు ఫోక్ సాంగ్‌లో ఛాన్స్ ఇస్తానని పిలిచాడు. తీరా వచ్చాక గంటల కొద్దీ కూర్చోబెట్టి ఆఖరికి మగ బుద్ధి చూపించాడు. దయచేసి గుడ్డిగా నమ్మి ఎవరూ హైదరాబాద్‌కు రావొద్దు. ఒక అమ్మాయి సినీ ఫీల్డ్‌లో సెటిల్ అయ్యిందంటే దాని వెనుక కమిట్‌మెంట్‌ ఇచ్చే ఉంటుంది. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేసినా ఫర్వాలేదు. నా లైఫ్‌లో సినీ ఫీల్డ్ జోలికి వెళ్లను. నా ఊర్లోనే ఉంటూ రీల్స్  చేసుకుంటూ బిజినెస్‌ చూసుకోవాలని డిసైడ్ అయ్యా.' అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరలక్ష్మి అనే ఇన్ స్టా పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement