ఆ ఇద్దరికి 'కొరియన్ కనకరాజు' హిట్‌ అవసరం | Korean Kanaka Raju Movie is crucial for Varun Tej | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరికి 'కొరియన్ కనకరాజు' హిట్‌ అవసరం

Aug 5 2026 11:40 PM | Updated on Aug 6 2026 5:37 AM

Korean Kanaka Raju Movie is crucial for Varun Tej

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, రితికా నాయక్‌తో కలిసి నటిస్తున్న చిత్రం కొరియన్ కనకరాజు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌లో ఈసారి కొరియన్ కనకరాజు సినిమా అత్యంత కీలకంగా మారింది. వరుసగా వచ్చిన ఫ్లాపుల కారణంగా అతడి మార్కెట్ బాగా పడిపోయింది. మట్కా, ఆపరేషన్ వాలంటైన్, గాండీవధారి అర్జున వంటి సినిమాలు ఒక్కదాన్ని మించి ఇంకోటి ఫ్లాప్ కావడంతో వరుణ్ మార్కెట్ దెబ్బతింది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా అంగీకరించాడు. అవన్నీ తనకు అనుభవాలుగా మిగిలాయని చెప్పాడు.  

ఇప్పుడు మాత్రం పరిస్థితులు కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి. కొరియన్ కనకరాజు టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దాంతో పాటు యూనిట్ చేసిన ప్రచారం ప్రేక్షకులకు విస్తృతంగా చేరింది. విడుదలకు ముందే సినిమాకు బజ్ రావడం కొంత వరకు వరుణ్ తేజ్‌కు అదృష్టమనే చెప్పాలి. ఈ సినిమా దర్శకుడికి కూడా ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేకపోవడంతో ఈ సినిమా విజయం అతనికి అత్యవసరం. ఇక ఈ చిత్ర హీరోయిన్ రితికా నాయక్‌ ఇప్పటికే హిట్‌ల మీద ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రధానంగా హీరో-దర్శకుడి భవిష్యత్తును నిర్ణయించనుంది. వరుణ్ తేజ్ కు ఈసారి హిట్ తప్పనిసరి. బజ్, ప్రచారం, అంచనాలు అన్నీ కలిసొచ్చాయి. ఇప్పుడు ప్రేక్షకుల తీర్పే కీలకం. ఈ చిత్రం ఆగస్ట్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరియా బ్యాక్ డ్రాప్‌లో హారర్ యాక్షన్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వరుణ్ ఇందులో రెండు డిఫరెంట్‌ పాత్రల్లో నటించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement