టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రముఖ శైవక్షేత్రమైన అరుణాచలం సందర్శించింది. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. అమ్మతో కలిసి అరుణాచలేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. ఆలయంలో శ్రీలీలను గమనించిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం, మాస్ జాతర, రాబిన్‌హుడ్ చిత్రాలతో అలరించింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. అల్లు అర్జున్ పుష్ప-2లో ఐటమ్ సాంగ్‌తో ఆకట్టుకుంది. కిస్సిక్ అంటూ అభిమానులను అలరించింది. ఈ ఏడాది శివ కార్తికేయన్ సరసన పరాశక్తి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది.
Our girl #Sreeleela at Tiruvannamalai pic.twitter.com/naeZUbBt0u
— KUMAR || Vaathi సార్ || Venky Atluri&Nelson Fan || (@RajiniDhanush5) August 5, 2026


