రాహుల్ సిప్లిగంజ్ మానవత్వం.. గబ్బర్ సింగ్‌ నటుడికి సాయం | Singer Rahul Sipligunj Helps To Gabbar Singh Actor Ramesh | Sakshi
Sakshi News home page

Rahul Sipligunj: గబ్బర్ సింగ్‌ నటుడికి సింగర్ సిప్లిగంజ్ సాయం

Aug 5 2026 6:48 PM | Updated on Aug 5 2026 7:08 PM

Singer Rahul Sipligunj Helps To Gabbar Singh Actor Ramesh

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మానవత్వం చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న నటుడికి అండగా నిలిచారు. గబ్బర్ సింగ్ నటుడు రమేశ్‌కు ఆర్థిక సాయమందించారు. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వైద్యం కోసం స్వయంగా తన వంతుగా లక్ష రూపాయలు అందజేశారు. అతను కోలుకోవాలని.. ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. దీంతో రాహుల్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా.. గబ్బర్ సింగ్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో  కుటుంబ సభ్యులు  హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో రమేశ్‌ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ఆ సినిమాలో వచ్చే అంత్యాక్షరి కామెడీ ఎపిసోడ్ ద్వారా ఫేమస్ ‍అయ్యాడు. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో కూడా కనిపించారు. వీటితో పాటు టాలీవుడ్‌లో పలు చిన్న, మధ్యతరహా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ పాత్రల్లో నటించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement