ముగిసిన ప్రదీప్ రావత్ అంత్యక్రియలు.. సినీ ప్రముఖుల నివాళులు | Actor Pradeep Rawat Pradeep Rawatfinal rites completed in mumbai | Sakshi
Sakshi News home page

Pradeep Rawat: ముగిసిన ప్రదీప్ రావత్ అంత్యక్రియలు.. సినీ ప్రముఖుల నివాళులు

Aug 5 2026 5:37 PM | Updated on Aug 5 2026 5:43 PM

Actor Pradeep Rawat Pradeep Rawatfinal rites completed in mumbai

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని గోరెగావ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, రాజ్ అర్జున్, కరణ్ వి గ్రోవర్, సురేంద్ర పాల్, రుహానికా ధావన్ తదితరులు ఉన్నారు. అంత్యక్రియల సమయంలో రావత్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

కాగా..గత ఐదేళ్లుగా బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్‌ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. భివండిలోని ఒక ఆసుపత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన మరణాన్ని 'లగాన్' సహనటుడు యశ్‌పాల్ శర్మ ధృవీకరించారు. ప్రదీప్‌ మృతి పట్ల అఖిల భారత సినీ కార్మికుల సంఘం  సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.

రావత్ కెరీర్..

కాగా.. హిందీ మూవీ బాఘితో  సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత  నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్‌షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్‌, నాయక్‌, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు.  తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement