ప్రియుడితో హీరోయిన్ ఎంగేజ్‌మెంట్‌.. పోస్ట్ వైరల్ | Jiyaa Shankar introduces fiance Kaaran in romantic engagement reveal | Sakshi
Sakshi News home page

Jiyaa Shankar: ప్రియుడితో హీరోయిన్ ఎంగేజ్‌మెంట్‌.. పోస్ట్ వైరల్

Aug 5 2026 7:29 PM | Updated on Aug 5 2026 7:31 PM

Jiyaa Shankar introduces fiance Kaaran in romantic engagement reveal

ప్రముఖ నటి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ భామ జియా శంకర్ తన కాబోయే భర్తను పరిచయం చేసింది. ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రియుడు కరణ్‌తో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ శుభవార్త విన్న అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.

కాగా.. అభిషేక్ మల్హన్‌తో డేటింగ్ రూమర్స్ ఖండించిన కొన్ని నెలలకే ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడం విశేషం. జియా, అభిషేక్‌లు గతంలో బిగ్ బాస్ ఓటీటీ -2 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక మ్యూజిక్ వీడియోలో కలిసి పనిచేశారు. దీంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఈ వార్తలను జియా కొట్టిపారేసింది.

జియా శంకర్‌ బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా బిగ్‌బాస్‌తో పాటు చాలా రియాలిటీ షోలలో మెరిసింది. తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. ఎంత అందంగా ఉన్నావే మూవీలో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ నటించిన హైదరాబాద్‌ లవ్ స్టోరీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఈ భామ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement