breaking news
jiya
-
ఫస్ట్ టైమ్ దిగ్విజియా
ఒకప్పుడు జియా రాయ్‌ని చూసి అందరూసానుభూతితో ‘అయ్యో!’ అనుకునేవారు. ఇప్పుడు ప్రపంచమంతా ‘ఆహా!’ అంటూ అభినందిస్తోంది. రెండేళ్ల వయసులో జియా రాయ్ శారీరక, మానసిక ఎదుగుదల లోపాలకు సంబంధించిన స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఈతకొలనులో ఈత కొడుతున్న వారిని చూసినప్పుడల్లా ఆ చిన్నారి కళ్లలో ఏదో వెలుగు కనిపించేది. ఆ వెలుగును పసిగట్టిన తల్లిదండ్రులు జియాకు స్విమ్మింగ్ నేర్పించారు. తాజా విషయానికి వస్తే... ముంబైలో పద్దెనిమిదేళ్ల పారా–స్విమ్మర్ జియా రాయ్ ప్రతిష్ఠాత్మకమైన ‘ట్రిపుల్ క్రౌన్ ఆఫ్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్’ను పూర్తి చేసి, ప్రపంచంలోనే మొదటి మహిళా పారా–స్విమ్మర్ గా చరిత్ర సృష్టించింది.న్యూయార్క్ నగరంలోని మన్‌హట్టన్ చుట్టూ 48 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా ఈది అద్భుతమైన ఘనతను సొంతం చేసుకుంది జియా రాయ్. అత్యంత కష్టంగా భావించే ‘20 బ్రిడ్జెస్ స్విమ్’ అనే పోటీని పూర్తి చేయడానికి 8 గంటల 53 నిమిషాల సమయం పట్టింది.ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన ఓపెన్–వాటర్ చాలెంజ్‌లలో ఒకటిగా మన్‌హట్టన్ సర్క్యూట్‌ను పరిగణిస్తారు. అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు, పడవల రద్దీని తట్టుకొని, రోజంతా మారుతూ ఉండే శక్తిమంతమైన ఆటుపోటు ప్రవాహాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. ఒకానొక సమయంలో జియా రాయ్ శరీర ఉష్ణోగ్రత పడిపోయి ప్రమాదం బారిన పడింది.ఎస్కార్ట్ బోట్ తాకకుండా...న్యూయార్క్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ నీటి నుండి బయటికి రాకుండా, ఎస్కార్ట్ బోట్‌ను తాకకుండా మొత్తం దూరాన్ని పూర్తి చేసింది జియా. ఆమె నీటిలో ఉన్నంతసేపు ఒక ఫీడింగ్ పోల్ ద్వారా అవసరమైన ద్రవాలు, పోషకాలను అందించారు.‘ఆగస్ట్ 30 తెల్లవారుజామున బ్యాటరీ పార్క్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించి, అదేరోజు మధ్యాహ్నం ఫినిష్లైన్కు చేరుకుంది’ అని ఆమె తండ్రి, నావికాదళంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న మదన్ రాయ్ తెలియజేశారు.ఆటిజం, స్పెక్ట్రమ్ డిజార్డర్‌పై అవగాహన కలిగించడానికి తన విజయాన్ని అంకితం చేసింది జియా రాయ్. ఈ విజయం ఆమె ఎన్నో ఏళ్ల కష్టానికి దొరికిన ప్రతిఫలం.ఆ వెలుగు చూసి...రెండు సంవత్సరాల వయసులో జియా, ఎదుగుదల లోపాలకు సంబంధించిన స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. ప్రతిరోజు తండ్రితోపాటు పార్క్‌లకు వెళుతుండేది జియా. ఈ క్రమంలోనే ఈ చిన్నారికి స్విమ్మింగ్‌పై ఆసక్తి పెరిగింది. స్విమ్మింగ్‌కు సంబంధించి వీడియోల ద్వారా తల్లిదండ్రులు ఈ చిన్నారికి మార్గనిర్దేశం చేసేవారు. బాల్యంలోనే స్విమ్మింగ్‌పై ఆసక్తి జియాను పారా–స్విమ్మింగ్ కెరీర్లోకి అడుగు పెట్టేలా చేసింది.ఎన్నో విజయాలు!ట్రిపుల్ క్రౌన్ సాధించాలంటే మూడు ప్రధాన ఈత పోటీలలో విజయం సాధించాలి. 2024లో ఇంగ్లీష్ చానల్, 2025లో కాటలినా చానల్, 20 బ్రిడ్జెస్ స్విమ్ విజయవంతంగా పూర్తి చేసింది జియా రాయ్.గతంలోనూ ఎన్నో గొప్ప విజయాలు సొంతం చేసుకుంది. మార్చి 2022లో పాక్ జలసంధిని అత్యంత వేగంగా ఈది, 29 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల 10 నిమిషాల్లో దాటి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఆటిజంతోపాటు స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతూ ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన మొదటి అమ్మాయిగా వార్తల్లో నిలిచింది జియా. ఆటలపై ఆమెకు ఉన్న అంకితభావానికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు వచ్చాయి. 2022లో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’వంటి అనేక ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు లభించాయి. -
ప్రియుడితో హీరోయిన్ ఎంగేజ్మెంట్.. పోస్ట్ వైరల్
ప్రముఖ నటి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ భామ జియా శంకర్ తన కాబోయే భర్తను పరిచయం చేసింది. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రియుడు కరణ్‌తో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ శుభవార్త విన్న అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.కాగా.. అభిషేక్ మల్హన్‌తో డేటింగ్ రూమర్స్ ఖండించిన కొన్ని నెలలకే ఎంగేజ్మెంట్ చేసుకోవడం విశేషం. జియా, అభిషేక్‌లు గతంలో బిగ్ బాస్ ఓటీటీ -2 సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక మ్యూజిక్ వీడియోలో కలిసి పనిచేశారు. దీంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఈ వార్తలను జియా కొట్టిపారేసింది.జియా శంకర్ బాలీవుడ్లో పలు సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా బిగ్‌బాస్‌తో పాటు చాలా రియాలిటీ షోలలో మెరిసింది. తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. ఎంత అందంగా ఉన్నావే మూవీలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ నటించిన హైదరాబాద్ లవ్ స్టోరీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఈ భామ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. View this post on Instagram A post shared by Jiyaa Shankar (@jiyaashankarofficial) -
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. తెలుగు సినిమాతోనే ఎంట్రీ!
బాలీవుడ్లో ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ-2 సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షోకు హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ- 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న జియా శంకర్ ఇటీవలే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే రియాలిటీ షో నుంచి బయటకొచ్చేసిన జియాశంకర్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కారు ముందు జియాశంకర్ కొబ్బరికాయ కొడుతూ కనిపించింది. (ఇది చదవండి: చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్ హిట్ డైరెక్టర్‌కు ఛాన్స్) అంతే కాకుండా జియా తన కొత్త కారు ముందు పోజులిస్తూ ఉత్సాహంగా కనిపించింది. ఆ తర్వాత అక్కడున్న వారందరికీ స్వీట్లు కూడా పంచింది. జియా కొనుగోలు చేసిన కారు యస్‌యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్5 మోడల్ కాగా.. ముంబయిలో ఈ మోడల్ కారు ధర దాదాపు రూ. 1.3 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జియా బిగ్ బాస్ ఓటీటీ- 2లో పాల్గొనడంతో ప్రేక్షకుల్లో మరింత ఆదరణ తెచ్చుకుంది. ఆమె ఈ రియాలిటీ షోలో టాప్-6 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. ఆమె 2013లో తెలుగు చిత్రం ఎంత అందంగా ఉన్నావే చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించింది. రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్‌లతో కలిసి మరాఠీ చిత్రం వేద్‌లో చివరిసారిగా జియా కనిపించింది. అంతే కాకుండా జియా లవ్ బై ఛాన్స్, ప్యార్ తునే క్యా కియా, మేరీ హనికరక్ బీవీ, కాటేలాల్ అండ్ సన్స్, లాల్ ఇష్క్, పిశాచిని, గుడ్‌నైట్ ఇండియా వంటి అనేక ప్రముఖ టీవీ షోలలో కనిపించింది. (ఇది చదవండి: జైలర్ నటుడితో జత కట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఫిబ్రవరి 23న ‘హైదరాబాద్ లవ్ స్టోరి’
త్వరలో చి..ల..సౌ సినిమాతో దర్శకుడిగా మారుతున్న రాహుల్ రవీంద్రన్ హీరోగానూ ఆసక్తికర చిత్రాలు చేస్తున్నారు. రాహుల్ రవీంద్ర, రేష్మి మీనన్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ’హైదరాబాద్ లవ్ స్టోరి’ ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్‌కు రెడీ అవుతోంది. జియా, రావు రమేష్, సూర్య, సనలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాజ్ సత్య దర్శకత్వం వహించారు. ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొడుమగుల్లలు సంయుక్తంగా నిర్మిస్తుండగా సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకనిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ లవ్‌స్టోరి మూవీ స్టిల్స్
-
హైదరాబాద్ లవ్ స్టోరి మూవీ స్టిల్స్


