క్రియేటివిటీ పీక్స్.. స్పైడర్‌ మ్యాన్ జంటకు పెళ్లి | Peter Parker marries MJ in South Indian wedding video goes Viral | Sakshi
Sakshi News home page

Tom Holland: స్పైడర్‌ మ్యాన్‌ జంటకు పెళ్లి.. అతిథులు ఎవరంటే?

Aug 5 2026 10:12 PM | Updated on Aug 5 2026 10:12 PM

Peter Parker marries MJ in South Indian wedding video goes Viral

హాలీవుడ్‌లో మార్వెల్ సినిమాటిక్‌ యూనివర్స్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ యూనివర్స్ నుంచి తాజాగా మరో మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్పైడర్ మ్యాన్- బ్రాండ్‌ న్యూ డే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.10 వేల కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.

ఈ మూవీకి ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. మనదేశంలోనూ కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో స్పైడర్‌ మ్యాన్ జంట టామ్ హాలెండ్‌, జెండయాకు సంబంధించిన ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరికీ ఏకంగా దక్షిణాది సంప్రదాయంలో పెళ్లి చేసిన వీడియో ఆసక్తిగా మారింది. ఈ పెళ్లి వేడుకలో సూపర్ హీరోస్, అవెంజర్స్ సందడి చేయడం.. దగ్గరుండి పెళ్లి వంటలు, భోజనాలు చేయడం చూస్తుంటే ఆడియన్స్‌కు నవ్వులు తెప్పిస్తోంది. ఈ ఫన్నీ ఏఐ వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement