డిసెంబరులో రిలీజ్‌? | Naga Chaitanya latest Vrushakarma releases on 30 December 2026 | Sakshi
Sakshi News home page

డిసెంబరులో రిలీజ్‌?

Aug 6 2026 4:14 AM | Updated on Aug 6 2026 4:14 AM

Naga Chaitanya latest Vrushakarma releases on 30 December 2026

‘తండేల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, ‘లాపతా లేడీస్‌’ మూవీ ఫేమ్‌ స్పర్శ్‌ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. ‘విరూపాక్ష’ చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్న కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ .బి నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుందనే టాక్‌ వినిపిస్తోంది. పౌరాణిక నేపథ్యం, థ్రిల్లింగ్‌ కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్ర కోసం నాగచైతన్య ఫిజికల్‌గా కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు. ఈ విషయాన్ని మార్చి 5న విడుదలైన గ్లింప్స్‌ స్పష్టం చేసింది. 

తన కెరీర్‌లో పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుని ‘వృష కర్మ’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు చైతన్య. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వేగంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై చిత్రయూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కాగా ఈ చిత్రానికి అజనీష్‌ బి. లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తుండగా, రాగుల్‌ డి. హెరియన్‌ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement