వదినకి ఏ చీర కావాలి?... నాగ చైతన్య సమాధానం ఇదే | Naga Chaitanya Sweet Reply While Shopping With Wife Sobhita Dhulipala In Hyderabad, Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: వదినకి ఏ చీర కావాలి?... నాగ చైతన్య సమాధానం ఇదే

Jul 19 2026 10:58 AM | Updated on Jul 19 2026 1:21 PM

Naga Chaitanya sobhita dhulipala visit shopping mall at hyderabad

టాలీవుడ్ హీరో నాగచైతన్య- శోభిత ధూలిపాళ్ల 2024 డిసెంబర్‌లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తమ కెరీర్‌లో బిజీగా ఉన్నారు. చైతూ ప్రస్తుతం వృషకర్మ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా శోభిత-నాగచైతన్య జంటగా వెళ్లి షాపింగ్‌కు వెళ్లారు. ఓ చీరల దుకాణంలో సందడి చేశారు. వదినకి ఏ చీర తీసుకుంటారని అక్కడివాళ్లు ప్రశ్నించారు. దీనికి చైతూ స్పందించారు. తను ఏది ఎంచుకుంటే... అదే తీసుకుంటానని నాగచైతన్య నవ్వుతూ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement