టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ మూవీలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే ఇటీవలే నాగచైతన్య తన భార్య శోభిత ధూలిపాళ్లతో ఓ పిక్ చేశారు. పెళ్లయిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత తొలిసారిగా నా భార్య శోభిత తన కోసం రాత్రి భోజనం వండిందని వెల్లడిస్తూ నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బహుశా ఈ రోజు నేను ఏదో సరైన పనే చేశానేమో అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ ఫోటోలో శోభిత లుక్ చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారని పోస్టులు పెడతున్నారు. ఈ ఫోటోలో శోభిత బేబీ బంప్‌తో కనిపించిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమపై వస్తున్న రూమర్స్‌పై ఇప్పటి వరకు చైతూ కానీ.. శోభిత కానీ స్పందించలేదు. వీళ్లిద్దరూ క్లారిటీ ఇస్తేనే రూమర్స్‌కు చెక్ పడనుంది.
కాగా.. టాలీవుడ్ హీరో నాగచైతన్య- శోభిత ధూలిపాళ్ల 2024 డిసెంబర్‌లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తమ కెరీర్‌లో బిజీగా ఉన్నారు. కాగా.. ఈ ఏడాది మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన చైతూ మాజీ భార్య సమంత.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చైతూ కూడా ఇదే ఏడాది గుడ్ న్యూస్ చెప్పనున్నాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


