కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ జంటగా వచ్చిన లవ్ ఎంటర్‌టైనర్ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలిరోజే రూ. 12.3 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సాయి రాజేష్, ఎస్ కే ఎన్ నిర్మించారు.
ఈ మూవీ రెండు రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రిలీజైన రెండు రోజుల్లోనే రూ.25.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల స్పందన రావడంతో రెండో రోజు వసూళ్లు రాబట్టింది. మొదటి రోజే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం.. బరిలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో వీకెండ్‌లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
#ChennaiLoveStory continues its SENSATIONAL BOX OFFICE RAMPAGE! ❤️🔥❤️🔥
𝟐𝟓.𝟐 𝐂𝐑+ 𝐆𝐑𝐎𝐒𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in just 𝟐 𝐃𝐀𝐘𝐒! 🔥🔥
Sunday kickstarts on a BLOCKBUSTER note at the box office! 💥💥
A CULT CLASSIC BLOCKBUSTER in every sense! 😍🫶🏻
Book your tickets now 🎟️… pic.twitter.com/ZVtx1U5WO9— Mass Movie Makers (@MassMovieMakers) July 26, 2026


