కోయంబత్తూరులో రామ్ చరణ్‌కి సర్జరీ | Ram Charan Hand Surgery In Coimbatore Hospital | Sakshi
Sakshi News home page

Ram Charan: 'పెద్ది' గాయం.. ఇన్నాళ్లకు శస్త్రచికిత్స

Jul 26 2026 3:19 PM | Updated on Jul 26 2026 3:29 PM

Ram Charan Hand Surgery In Coimbatore Hospital

గత నెలలో 'పెద్ది'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్.. తెలుగు రాష్ట్రాల వరకు ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో చరణ్ మణికట్టుకి గాయమైంది. ప్రమోషన్లలోనూ చేతికి కట్టుతోనే కనిపించాడు. దీనికి సర్జరీ అవసరమవుతుందని అప్పట్లోనే వార్తలొచ్చాయి. చివరకు ఇన్నాళ్లకు చరణ్ శస్త్రచికిత్స చేసుకోనున్నాడు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం ఇది జరగనుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి గుండెల్ని పిండేసే తెలుగు లవ్‌స్టోరీ సినిమా)

రామ్ చరణ్‌కు అండగా ఉండేందుకు తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో పాటు భార్య ఉపాసన కోయంబత్తూరుకు బయలుదేరారు. సర్జరీ జరగనున్న నేపథ్యంలో రామ్ చరణ్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లలో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. చరణ్ తర్వాత ప్రాజెక్ట్ విషయానికొస్తే సుకుమార్‌తో చేయనున్నాడు. చాన్నాళ్ల క్రితమే అధికారిక ప్రకటన వచ్చేసింది. కానీ షూటింగ్ మొదలయ్యేసరికి వచ్చే ఏడాది వేసవి పట్టొచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: వివాదంలో 'ఒడిస్సీ'.. కనీసం రూ.6 లక్షలు చెల్లించలేరా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement