నడకమార్గంలో ‘పెద్ది’ సినిమా పోస్టర్‌తో మహిళ హల్‌చల్‌ | Woman Hulchul With Peddi Movie Poster In Tirumala Nadaka Margam | Sakshi
Sakshi News home page

నడకమార్గంలో ‘పెద్ది’ సినిమా పోస్టర్‌తో మహిళ హల్‌చల్‌

Jul 22 2026 4:41 PM | Updated on Jul 22 2026 6:22 PM

Woman Hulchul With Peddi Movie Poster In Tirumala Nadaka Margam

సాక్షి, తిరుమల: తిరుమలో భద్రతా సిబ్బంది పర్యవేక్షణ లోపం మరోసారి బయటపడింది. తిరుమల నడక మార్గంలో ‘పెద్ది’ సినిమా పోస్టర్‌తో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. నిషేధం ఉన్నా పోస్టర్‌తో మహిళ రావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ, సినిమా ప్రచారాలకు తిరుమలలో అనుమతి లేదు. పెద్ది సినిమా పోస్టర్‌తో  మహిళ నడిచిన  వీడియో వైరల్‌గా మారింది. తిరుమల పవిత్రతపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సోషల్‌ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

కాగా, గత శుక్రవారం(జులై 17) తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం శ్రీరంగం నుంచి పట్టువ్రస్తాల సమర్పణ వైభవంగా జరుగుతుండగా, మరోవైపు మహాద్వారం గుండా అనుమతి లేకుండానే ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడన్న ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధుల కథనం ప్రకారం.. రాజారెడ్డి అనే వ్యక్తి అధికారిక అనుమతి లేకుండానే శుక్రవారం తిరుమల ఆలయ మహాద్వారం ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. మహాద్వారం వద్ద విధులు నిర్వహించే విజిలెన్స్‌ అధికారులు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాల్సి ఉండగా, ఈ ఘటనలో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి.

 "పెద్ది" మూవీ పోస్టర్ తో తిరుమలలో మహిళ హల్ చల్..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement