‘తిరుమల ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?’ | Bhumana Karunakar Reddy React On Theft Of Anjaneya Idol In Tirumala | Sakshi
Sakshi News home page

‘తిరుమల ప్రక్షాళన అంటే ఇదేనా చంద్రబాబు?’

Jul 22 2026 3:47 PM | Updated on Jul 22 2026 4:01 PM

Bhumana Karunakar Reddy React On Theft Of Anjaneya Idol In Tirumala

సాక్షి, తిరుపతి: ‘‘తిరుమలలో హనుమాన్‌ విగ్రహం మాయమైంది. వందల ఏళ్ల పురాతన విగ్రహం చోరీకి గురైంది. కూటమి చేస్తానన్న తిరుమల ప్రక్షాళన ఇదేనా? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు.

‘‘25 వేల మందికి పైగా మెట్ల మార్గం పాదయాత్ర ద్వారా తిరుమలకు వెళ్లే మార్గంలో ఈ విగ్రహాన్ని దర్శిస్తారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి రోజున  వైభవంగా టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. విగ్రహం చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

..టీటీడీ విజిలెన్స్ అధికారులు చోరీ చేసిన దొంగను పిచ్చివాడిగా ముద్ర వేసే కుట్ర జరుగుతోందని మాకు సమాచారం. నిత్యం కొండపై ఏదో ఒక ఘోరం, అపచారం జరుగుతోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు చెందిన అంశం ఇది. చంద్రబాబు బాధ్యతా వహించాలి. టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి’’ అని భూమన డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement