సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో దేవుడికి కూడా రక్షణ లేదని.. తిరుమలలో 60 ఏళ్ల చరిత్ర ఉన్న విగ్రహం చోరీకి గురైందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
‘‘బీఆర్ నాయుడు రావటంతోనే గోవులు చనిపోయాయి. ఇక అప్పట్నుంచి తరచూ ఏదోక అపచారం జరుగుతూనే ఉంది. మద్యం, గంజాయి, మాంసాహారం కొండ మీద వస్తుంది. బీఆర్ నాయుడు టీటీడీని ఛైర్మన్‌గా కాకుండా ఒక టీవీ ఛానల్ నడిపినట్టు నడుపుతున్నారు. దందాలు, సెటిల్‌మెంట్లు, అక్రమాలు భారీగా జరుగుతున్నాయి
..విగ్రహం చోరీ జరిగితే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. మెట్లు కడిగిన నాయకులు ఏమయ్యారు?. చంద్రబాబు పాలనలో ఆలయాలు కూల్చేయడం, విగ్రహాల చోరీలు జరుగుతున్నాయి. బీఆర్ నాయుడు రాకతో తిరుమల క్షేత్రంలో అపచారం జరిగింది’’ అని శ్యామల మండిపడ్డారు.


