నెలాఖర్లో హాయ్‌ | Nayanthara and Kavin Hi release postponed to August 28 | Sakshi
Sakshi News home page

నెలాఖర్లో హాయ్‌

Aug 8 2026 12:19 AM | Updated on Aug 8 2026 12:19 AM

Nayanthara and Kavin Hi release postponed to August 28

ఈ నెలాఖర్లో థియేటర్స్‌లో ‘హాయ్‌’ చెప్తానంటున్నారు నయనతార. కవిన్, నయనతార లీడ్‌ రోల్స్‌లో నటించిన తమిళ సినిమా ‘హాయ్‌’. విష్ణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. భాగ్యరాజ్, ప్రభు, రాధికా శరత్‌కుమార్, వీటీవీ గణేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో బ్యానర్లపై నయనతార, విఘ్నేష్‌ శివన్, ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మించారు.

కాగా, ఈ చిత్రాన్ని ఈ నెల 28న రిలీజ్‌ చేయనున్నట్లు శుక్రవారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. ‘‘బంధాలు, అనుబంధాలు, హాస్యంతో సాగే ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా ఇది’’ అని తెలిపారు దర్శకుడు విష్ణు. ఇక ఈ సినిమాను తొలుత ఈ నెల 14న రిలీజ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు మేకర్స్‌. అయితే 28కి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement