కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ అండ్ బోల్డ్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలుసార్లు వాయిదా పడగా.. ఎట్టకేలకు ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయొలెంట్‌గా ఉంది. ఈ ట్రైలర్‌తో టాక్సిక్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
ట్రైలర్ తర్వాత టాక్సిక్ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మూవీకి సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాకు యశ్, కియారా, నయనతార ఎంత తీసుకున్నారనే దానిపై చర్చ నడుస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి కాస్తా గట్టిగానే ఛార్జ్ చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాకు కేజీఎఫ్ స్టార్ యశ్ దాదాపు రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని శాండల్‌వుడ్‌లో టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ కియారాకు కూడా భారీగానే ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆమెకు ఏకంగా రూ.15 కోట్లు చెల్లించనున్నారని సమాచారం. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార రూ.12 నుంచి 18 కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నట్లు తెలుస్తోంది.
అలాగే కాంతార ఫేమ్ రుక్మిణీ వసంత్ సైతం భారీగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రూ.3 నుంచి 5 కోట్ల వరకు ఛార్జ్ చేయనుందని టాక్. అలాగే బాలీవుడ్ భామలు హ్యుమా ఖురేషీ, తారా సుతారియా రూ.2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన కేవలం హీరో, హీరోయిన్లకే దాదాపు వంద కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని అర్థమవుతోంది. ఇంత భారీ ఎత్తున నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే.


