మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్ | Urmila Matondkar Reacts Her Ex Husband Wedding | Sakshi
Sakshi News home page

Urmila Matondkar: అలాంటి విషయాలే నాకు నచ్చుతాయ్

Aug 12 2026 11:56 AM | Updated on Aug 12 2026 12:06 PM

Urmila Matondkar Reacts Her Ex Husband Wedding

రంగీలా, గాయం, సత్య, భూత్ లాంటి సినిమాలతో అప్పట్లో పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఊర్మిళా మతోండ్కర్.. ప్రస్తుతం నటనకు పూర్తిగా దూరమైంది. ఎనిమిదేళ్ల క్రితం ఓ మూవీ చేయగా, నాలుగేళ్ల క్రితం ఓ షోలో కనిపించింది. కొన్నాళ్ల క్రితం రాజకీయాల్లోకి కూడా వచ్చింది గానీ ఇందులోనూ ఎక్కువనాళ్లు ఉండలేదు. అలాంటి ఈమె ఉన్నఫలంగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఈమె మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.

(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్)

ఊర్మిళా..2018లో నటుడు మొహ్సిన్‌ అక్తర్‌ మీర్‌ని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్లిద్దరూ 2024లో విడాకులు తీసుకున్నారు. రీసెంట్‌గా మొహ్సిన్ మరో వివాహం చేసుకున్నాడు. ఆ ఫొటోలని‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఇవి బయటకు రావడానికి కొన్ని గంటల ముందే ఉర్మిళా ఇన్ స్టాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్ అయింది..

'ప్రేమ, సమయం, విధేయత లాంటి ఖరీదైన విషయాలే నాకు నచ్చుతాయి' అనో ఊ‍ర్మిళా ఓ కోట్ షేర్ చేసింది. అయితే ఇది భర్తని ఉద్దేశించే పెట్టిందా అని పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొహ్సిన్‌ పేరు ప్రస్తావించనప్పటికీ అతడికి కౌంటర్ ఇస్తూనే ఊర్మిళా తన భావాన్ని బయటపెట్టిందని అనుకుంటున్నారు.

(ఇదీ చదవండి: 'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement