breaking news
Mohsin Khan
-
మాజీ భర్త రెండో పెళ్లి.. హీరోయిన్ ఊర్మిళా కౌంటర్ పోస్ట్
రంగీలా, గాయం, సత్య, భూత్ లాంటి సినిమాలతో అప్పట్లో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఊర్మిళా మతోండ్కర్.. ప్రస్తుతం నటనకు పూర్తిగా దూరమైంది. ఎనిమిదేళ్ల క్రితం ఓ మూవీ చేయగా, నాలుగేళ్ల క్రితం ఓ షోలో కనిపించింది. కొన్నాళ్ల క్రితం రాజకీయాల్లోకి కూడా వచ్చింది గానీ ఇందులోనూ ఎక్కువనాళ్లు ఉండలేదు. అలాంటి ఈమె ఉన్నఫలంగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఈమె మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్)ఊర్మిళా..2018లో నటుడు మొహ్సిన్ అక్తర్ మీర్ని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్లిద్దరూ 2024లో విడాకులు తీసుకున్నారు. రీసెంట్గా మొహ్సిన్ మరో వివాహం చేసుకున్నాడు. ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఇవి బయటకు రావడానికి కొన్ని గంటల ముందే ఉర్మిళ తన ఇన్ స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది.'ప్రేమ, సమయం, విధేయత లాంటి ఖరీదైన విషయాలే నాకు నచ్చుతాయి' అని ఊర్మిళా ఓ కోట్ షేర్ చేసింది. అయితే ఈమె తన మాజీ భర్తని ఉద్దేశించే పెట్టిందా అని పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొహ్సిన్ పేరు ప్రస్తావించనప్పటికీ అతడికి కౌంటర్ ఇచ్చేలా ఊర్మిళ తన భావాన్ని బయటపెట్టిందని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'డిసి' హీరోయిన్ వామికా ఖరీదైన 'ఐఫోన్' గిఫ్ట్) -
'బాబర్ ఆజం ముందు విరాట్ కోహ్లి జీరో': పాక్ మాజీ క్రికెటర్
ఛాంపియన్స్ ట్రోఫీ-20525లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ఆ దేశ మాజీ క్రికెటర్ల బుద్ది మాత్రం మారలేదు. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, వకార్ యూనిస్ వంటి పాక్ దిగ్గజాలు తమ జట్టుపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. మరి కొంతమంది మాజీ క్రికెటర్లు మాత్రం భారత్‌పై విషం చిమ్ముతున్నారు. తాజాగా పాకిస్తాన మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్.. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కించపరిచి మాట్లాడాడు. విరాట్ కోహ్లి కంటే పాక్ ఆటగాడు బాబర్ ఆజం ఎంతో బెటర్ అని అతడు విమర్శించాడు.మీకు ఒక్క విషయం చెప్పాలనకుంటున్నాను. బాబర్ ఆజంతో విరాట్ కోహ్లిని దయచేసి పోల్చవద్దు. బాబర్ ముంగిట విరాట్ కోహ్లి జీరో. మనం ఇక్కడ ఎవరు మంచి ఆటగాడు అనే దాని గురించి మాట్లాడటం లేదు. ఇక ఈ విషయం గురించి వదిలేద్దాం. పాకిస్తాన్ క్రికెట్ పతనం గురించి మాట్లాడుతున్నాము. ప్రణాళిక లేదు, వ్యూహాలు లేవు, జవాబుదారీతనం లేదు. పాక్ క్రికెట్ నాశనం అవుతోంది అని మొహ్సిన్ ఖాన్ ARY న్యూస్‌తో పేర్కొన్నారు.కాగా ఈ మెగా టోర్నీలో బాబర్ ఆజం విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లి మాత్రం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చెలరేగాడు. దీంతో తమ జట్టుపై విరాట్ సెంచరీ చేయడాన్ని పాక్ మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లిపై తమ అక్కసును వెల్లగక్కుతున్నారు. అయితే మొహ్సిన్ ఖాన్‌కు భారత అభిమానులు గట్టిగా కౌంటిరిస్తున్నారు. విరాట్ కోహ్లికి బాబర్‌కు పోలికా, కొంచమైనా సిగ్గు ఉండాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా మెగా టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. వరుసగా మూడు విజయాలతో గ్రూపు స్టేజిని టీమిండియా ఆజేయంగా ముగించింది. మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: 'అఫ్గానిస్తాన్‌ను చూసి నేర్చుకోండి'.. విండీస్‌కు వివ్ రిచర్డ్స్ హితవు -
IPL 2024: వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నోకు బిగ్ షాక్
ఐపీఎల్ 2024 సీజన్‌తో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్లు మయాంక్ యాదవ్, మొహిసిన్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నారని తెలుస్తుంది. వీరిద్దరు గాయాల బారిన పడినట్లు సమాచారం. మయాంక్ పొత్తి కడుపు నొప్పితో.. మొహిసిన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారని ఎల్ఎస్జీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా పొత్తి కడుపు నొప్పితో విలవిలలాడిన మయాంక్ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. మయాంక్‌ను వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలుస్తుంది. గత మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన మొహిసిన్.. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా వెన్ను నొప్పి సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుత సీజన్లో మయాంక్ యాదవ్ సంచలన ప్రదర్శనలతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసి రెండింట ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. భీకర ఫామ్‌లో ఉండగా మయాంక్ గాయపడటం ఎల్ఎస్జీని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు మొహిసిన్ సైతం ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. మొహిసిన్ ఎల్ఎస్జీ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. మయాంక్, మొహిసిన్ల గైర్హాజరీలో లక్నో తరఫున మరో యువ పేసర్ చెలరేగిపోయాడు. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో యశ్ ఠాకూర్ 3.5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. ఈ ప్రదర్శన కారణంగా యశ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే, జట్టులో ప్రతి ఆటగాడు తలో చేయి వేస్తుండటంతో లక్నో ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓటమి మినహా లక్నో అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రాజస్థాన్ చేతిలో ఓటమి అనంతరం ఈ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. లక్నో ఏప్రిల్ 12న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లక్నో సొంత మైదానంలో జరుగనుంది. -
T20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే!.. ఎవరూ ఊహించని ప్లేయర్‌కు ఛాన్స్!?
టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి. 20 జట్లు ఐదు గ్రూప్‌లుగా విడిపోయి.. లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తంగా 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. అనంతరం జూన్ 9 చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా ఐపీఎల్లో బీజీబీజీగా ఉన్నారు. ఈ పొట్టి ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి వారంలో ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కాగా ఈవెంట్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సెలక్టర్లు కంటే ముందే భారత జట్టును ఎంపిక చేశాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇర్ఫాన్ ఎంపిక చేశాడు. ఈ జట్టులో అనూహ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్‌ను పఠాన్ చోటిచ్చాడు. ఇర్ఫాన్ తన ఎంపిక చేసిన జట్టులో స్పెషలిస్టు బ్యాటర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లకు అవకాశమిచ్చాడు. అదే విధంగా వికెట్ కీపర్ల కోటాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మలను పఠాన్ ఎంపిక చేశాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు చోటు దక్కింది. స్పెషలిష్ట్ స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను ఇర్ఫాన్ ఎంచుకున్నాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్, బుమ్రాను ఎంపిక చేసిన ఇర్ఫాన్.. మూడో సీమర్‌గా మొహ్సిన్ ఖాన్‌ను తన జట్టులోకి తీసుకున్నాడు. పఠాన్ ఎంపిక చేసిన జట్టు ఇదే: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, సిరాజ్, బుమ్రా, మొహ్సిన్ ఖాన్ -
పది రోజులుగా మా నాన్న ఐసీయూలో ఉన్నాడు.. ఆయన కోసమే: లక్నో హీరో
ఐపీఎల్-2023లో అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు పేసర్ మొహ్సిన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ముంబై విజయానికి ఆఖరి ఓవర్లో 11 అవసరమవ్వగా.. లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా బంతిని మొహ్సిన్ ఖాన్ చేతికి ఇచ్చాడు. అయితే క్రీజులో టిమ్ డేవిడ్, గ్రీన్ వంటి పవర్ హిట్టర్లు ఉండడంతో ముంబై ఈజీగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే మొహ్సిన్ ఖాన్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. ఆఖరి ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబైకు ఊహించని షాకిచ్చాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన మొహ్సిన్ ఖాన్ 26 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక మొహ్సిన్.. ఈ అద్భుత ప్రదర్శను అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి అంకితం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు పది రోజులుగా మొహ్సిన్ తండ్రి ఐసీయూలో ఉన్నాడు. ఆ బాధను దిగమింగుతూ కూడా మొహ్సిన్ అద్భుతంగా రాణించాడు. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మొహ్సిన్ వెల్లడించాడు. "గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్‌తో మైదానంలో అడుగుపెట్టాను. ఇది నాకు కష్టకాలం. మా నాన్న పది రోజులు ఐసీయూలో ఉన్న తర్వాత నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. మా నాన్న ఈ మ్యాచ్ చూస్తున్నారన్న నమ్మకం ఉంది. ఆయనకు ఈ ప్రదర్శనను అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాను. మా జట్టు విజయంలో నావంతు పాత్ర పోషించింనందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసేందుకు అవకాశం ఇచ్చిన సపోర్ట్ స్టాప్‌కు ధన్యవాదాలు" అని మ్యాచ్ అనంతరం మొహ్సిన్ ఖాన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: లక్నో చేతిలో ఓటమి.. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే? అలా జరిగితే కష్టమే -
లక్నో విజయం.. ఒక్క ఓవర్‌తో హీరో అయిపోయాడు
ఐపీఎల్ 16వ సీజన్లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠను కలిగించింది. టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 30 పరుగులతో సంచలన ఇన్నింగ్స్‌తో ముంబైని గెలిపిస్తాడనుకున్నారు. ఈ తరుణంలో ఒక్క ఓవర్‌తో అంతా తారుమారు చేసి హీరో అయ్యాడు లక్నో బౌలర్ మోసిన్ ఖాన్. మోసిన్ ఖాన్ బౌలింగ్ రావడానికి ముందు నవీన్ ఉల్ హక్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. దీంతో చివరి ఓవర్లో ముంబై విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు అవసరమయ్యాయి. ఇక ముంబై విజయం లాంచనమే అనుకున్న తరుణంలో మోసిన్ ఖాన్ అద్బుత యార్కర్లతో చెలరేగాడు. 11 పరుగులు అవసరమైన దశలో అద్బుత యార్కర్లతో కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చుకొని లక్నోకు సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ప్లేఆఫ్‌లో అడుగుపెట్టడం ఖాయం. Naveen Ul Haq tried everything to loose the match but Mohsin Khan and Cameron Green had another plans for LSG 😂#LSGvMI #MohsinKhan#LSG #camerongreen #naveenulhaq #GautamGambhirpic.twitter.com/ppr1AZvz5j — VK18Forever (Fan Page) (@VKianForever) May 16, 2023 చదవండి: ప్రతీసారి మనది కాదు సూర్య.. జాగ్రత్తగా ఆడాల్సింది! -
లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ మొహ్సిన్ ఖాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలో అతడు త్వరలోనే లక్నో జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు మొహ్సిన్ ఖాన్ తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో ఈ మెగా టోర్నీ మొత్తానికి అతడు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించిడం.. లక్నో శిబరంలో సరికొత్త జోష్ నింపింది. అతడు పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లు లక్నో వైద్య బృందం కూడా దృవీకరించింది. ఇక ఇప్పటికే మార్క్ వుడ్, ఉనద్కత్, అవేష్ ఖాన్, నవీన్-ఉల్-హక్ వంటి అద్భుతమైన పేసర్లు ఉన్నారు. కాగా ఐపీఎల్ 2022 వేలంలో మొహ్సిన్ ఖాన్‌ను కేవలం రూ.20 లక్షలకు లక్నో కొనుగోలు చేసింది. మొహ్సిన్ ఖాన్ గతేడాది సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌లు ఆడిన మొహ్సిన్ 14 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2023 GT Vs RR: షమీపై సీరియస్ అయిన హార్దిక్.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? వీడియోవైరల్ -
‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా’
IPL 2022: ఐపీఎల్-2022 సీజన్లో పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ క్రికెటర్ మొహసిన్ ఖాన్. కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 6 కంటే తక్కువ ఎకానమీ (5.96)తో రెండో స్థానంలో కేవలం 14.07 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. మొహసిన్ సత్తా ఏమిటో అర్థం చేసుకోవడానికి ఈ గణాంకాలు చాలు. ఇలా అవకాశం వచ్చిన ఆరంభ సీజన్లోనే తానేంటో నిరూపించుకుని పలువురి దృష్టిని ఆకర్షించాడు. ఈ జాబితాలో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ఉన్నాడు. మొహసిన్ ప్రతిభకు షమీ ఫిదా అయినట్లు అతడి కోచ్ బరుద్దీన్ సిద్ధిఖి పేర్కొన్నాడు. ఐపీఎల్ మెగా వేలం-2022 నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ.. ‘‘వేలం జరుగుతున్న సమయంలో నేను షమీతో పాటే అతడి ఫామ్‌హౌజ్‌లో ఉన్నాను. షమీ సెలక్ట్ అయినట్లు తెలిసింది. అలాగే మొహసిన్‌ను కూడా లక్నో కొనుగోలు చేసింది. ఈ విషయం తెలియగానే.. ‘‘నాకొక నాలుగు నెలల సమయం ఇవ్వండి. మొహసిన్‌ను ఇండియాలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా. నిజానికి తను చాలా మంచి బ్యాటర్. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లు ఆడతాడని కేఎల్ రాహుల్ సైతం నాతో అన్నాడు’’ అని షమీ నాతో చెప్పాడు’’ అని సిద్ధిఖి స్పోర్ట్స్ యారీతో వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో షమీ ఎల్లప్పుడూ ముందుంటాడని ప్రశంసించాడు. కాగా సిద్ధిఖి గతంలో షమీతో కలిసి పనిచేశాడు. ఇక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ అయిన మొహసిన్‌కు ఎప్పుడు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 2018 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన 2019లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే, ఆడే అవకాశం మాత్రం రాలేదు. మెగా వేలం 2022లో ఈ లెఫ్టార్మ్ బౌలర్‌ను లక్నో 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆరంభ మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వకపోయినా కొన్ని కీలక మ్యాచ్‌లలో అదరగొట్టి 23 ఏళ్ల మొహసిన్ ఖాన్ అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకొన్నాడు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇదిలా ఉంటే.. గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన షమీ.. జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: Hardik Pandya: ఎన్నెన్ని మాటలు అన్నారో.. అదో పెద్ద యుద్ధం.. ఎన్ని త్యాగాలు చేశానో ఎవరికీ తెలియదు! ENG vs NZ: డారిల్ మిచెల్ భారీ సిక్సర్.. అభిమాని బీర్ గ్లాస్లో పడ్డ బంతి.. వీడియో వైరల్! An elated dugout as @LucknowIPL win by 6 runs against #DelhiCapitals.#TATAIPL #DCvLSG pic.twitter.com/EVagwBHHVA — IndianPremierLeague (@IPL) May 1, 2022 -
ఐపీఎల్ 2022లో అదరగొట్టిన లెఫ్టార్మ్ పేసర్లు వీరే..
ఐపీఎల్-2022 తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్‌కు చేరుకోగా.. క్వాలిఫైర్-2లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఇది ఇలా ఉంటే.. ఈ ఏడాది సీజన్లో యువ లెఫ్టార్మ్ పేసర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. మొహ్సిన్ ఖాన్, టి నటరాజన్, యష్ దయాల్, ఖలీల్ అహ్మద్ వంటి లెఫ్టార్మ్ బౌలర్లు తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. మొహ్సిన్ ఖాన్ ఐపీఎల్-2022లో మొహ్సిన్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ ప్రాతినిధ్యం వహించాడు. అయితే అతడికి టోర్నీ ఆరంభంలో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ కొన్ని మ్యాచ్‌ల తర్వాత తుది జట్టులోకి వచ్చిన మొహ్సిన్ అదరగొట్టాడు. పేస్ బౌలింగ్‌తో జట్టులో తన స్ధానాన్ని సుస్ధిరం చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన మొహ్సిన్ ఖాన్ 14 వికెట్లు పడగొట్టాడు. టి నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన టి.నటరాజన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు నటరాజన్ దూరమయ్యాడు. 11 మ్యాచ్‌లు ఆడిన నటరాజన్ 18 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ ఈ ఏడాది సీజన్లో ఖలీల్ అహ్మద్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతనిధ్యం వహించాడు. ఢిల్లీ విజయాల్లో ఖలీల్ తన వంతు పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌లు ఆడిన ఖలీల్ 16 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాళ్ గుజరాత్ టైటాన్స్ తరపున యశ్ దయాళ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. డెబ్యూ సీజన్లోనే యశ్ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన దయాళ్ 10 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: 'బట్లర్ నాకు రెండో భర్త' .. ఎలా అంటే: రాజస్తాన్ ఆటగాడి భార్య ఆసక్తికర వాఖ్యలు ! -
IPL 2022: చాన్స్ ఇస్తే... చెలరేగిపోవడమే... ఒకరు ఏకంగా టీమిండియలో.. మరొకరు!
IPL 2022: ఒకరు నెట్‌బౌలర్‌గా జట్టులోకి వచ్చి ఏడాది తిరిగే లోపు ఏకంగా భారత జట్టులోకి వచ్చేస్తే, మరొకరు మూడేళ్లు బెంచీకే పరిమితమై మరో జట్టు మ్యాచ్ ఇవ్వగానే చెలరేగిపోయాడు... వేలంలో ఎవరూ ఎంచుకోక నిరాశ చెందిన ఆటగాడు అదృష్టం కలిసొచ్చి మళ్లీ పిలుపు వచ్చినప్పుడు వస్తే ఒక్క ఇన్నింగ్స్‌తో తన విలువేంటో చూపించాడు. దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శనతో సీజన్‌కే హైలైట్‌గా నిలిచిన కుర్రాడు మరొకడు... ఐపీఎల్‌కు ఎంపిక కావడమే యువ క్రికెటర్ల దృష్టిలో ఒక ఘనత కాగా, తుది జట్టులో స్థానం లభించి సత్తా చాటడం మరో పెద్ద అడుగు. ఈ ఏడాది అలా ఐపీఎల్లో తమదైన ముద్ర వేసిన కొందరు ఆటగాళ్లను చూస్తే... ఉమ్రాన్ మలిక్ (సన్‌రైజర్స్) 2021 ఐపీఎల్లో తమ ఆటగాడు సమద్ చెప్పిన మాటలపై నమ్మకంతో జమ్ము కశ్మీర్‌కు చెందిన ఉమ్రాన్ మలిక్‌ను సన్‌రైజర్స్ నెట్ బౌలర్‌గా యూఏఈకి తీసుకెళ్లింది. సాధనలోనే అతడి వేగం అందరినీ కట్టి పడేసింది. నటరాజన్ కరోనా బారిన పడటంతో ఉమ్రాన్‌కు ప్రధాన టీమ్‌లో కూడా చోటు లభించింది. మూడు మ్యాచ్‌లలో అతను బరిలోకి దిగగా, నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం కెప్టెన్ కోహ్లిని కూడా ఆకర్షించింది. దాంతో వరల్డ్ కప్‌లో టీమిండియాకు సరైన ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ కోసం అతడిని బీసీసీఐ అక్కడే ఉంచింది. ఈ సీజన్‌కు వచ్చేసరికి మరింత రాటుదేలిన ఉమ్రాన్ తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ముఖ్యంగా గుజరాత్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన అద్భుతం. 14 సార్లూ ‘ఫాస్టెస్ట్ బాల్’ అవార్డు గెలుచుకున్న అతను 22 వికెట్లు పడగొట్టాడు. అనుభవంతో ప్రతీ మ్యాచ్‌కు మెరుగవుతూ వేగానికి బంతిపై నియంత్రణను కూడా జోడించడం సెలక్టర్లను ఆకట్టుకునేలా చేసి దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కేలా చేసింది. మొహసిన్ ఖాన్ (లక్నో సూపర్‌జెయింట్స్) 2018లో దేశవాళీ క్రికెట్లోకి వచ్చిన లెఫ్టార్మ్ పేసర్ మొహసిన్‌కు సరైన వేదిక లభించేందుకు నాలుగేళ్లు పట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌కు చెందిన మొహసిన్‌ను 2019లోనే ముంబై ఇండియన్స్ జట్టు తీసుకున్నా...మూడు సీజన్ల పాటు ఒక్క మ్యాచ్ కూడా ఆడించకుండా బెంచీకే పరిమితం చేసింది. తీవ్ర అసహనానికి గురైనా, ముంబైలాంటి జట్టులో అంత సులువుగా అవకాశం దక్కదు కాబట్టి తన ఆటను మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెట్టాడు. ఈ సారి లక్నో అతడిని ఎంచుకుంది. ఇక్కడా ఆరంభ మ్యాచ్‌లలో అతనికి అవకాశం దక్కలేదు. అయితే కొత్త బంతిని అందించిన మొదటి మ్యాచ్‌నుంచే సత్తా చాటుతూ అతని ప్రత్యర్థులను కట్టి పడేశాడు. అత్యంత పొదుపైన బౌలింగ్‌తో సత్తా చాటాడు. ఈ సీజన్లో 6 కంటే తక్కువ ఎకానమీ (5.96)తో రెండో స్థానంలో నిలిచిన మొహసిన్ కేవలం 14.07 సగటుతో 14 వికెట్లు కూడా తీశాడంటే అతని ప్రభావం ఏమిటో అర్థమవుతుంది. చదవండి: Who Is Mohsin Khan: ఢిల్లీ క్యాపిటల్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ మొహసిన్ ఖాన్..? రజత్ పటిదార్ (బెంగళూరు) గత సీజన్లో పటిదార్‌ను బెంగళూరు 4 మ్యాచ్‌లలో ఆడించగా, అతను మొత్తం 71 పరుగులు చేశాడు. ఈ సారి అతనిపై నమ్మకం లేక వేలంలో కనీసం పటిదార్ పేరు కూడా తీసుకోలేదు. ఆర్సీబీ మాత్రమే కాదు ఎవరూ వేలంలో ఎంచుకోకపోవడంతో రజత్ తన స్వస్థలం ఇండోర్ వెళ్లిపోయి సాధనలో మునిగిపోయాడు. అయితే అదృష్టం మరో రూపంలో కలిసొచ్చింది. లవ్నిత్ సిసోడియా గాయపడటంతో అతని స్థానంలో మళ్లీ రజత్‌ను ఆర్సీబీ పిలిచింది. తన రెండో మ్యాచ్‌లోనే 32 బంతుల్లో 52 పరుగులు చేసినా జట్టు ఓటమితో ఆ ఆటకు గుర్తింపు దక్కలేదు. లీగ్ దశలో 5 మ్యాచ్‌లలోనూ చెప్పుకోదగ్గ పరుగులే చేసిన రజత్...నాకౌట్ మ్యాచ్‌లో తానేంటో చూపించాడు. మైదానమంతా చెలరేగిపోతూ ఎలిమినేటర్ అతను చేసిన సెంచరీ బెంగళూరు అభిమానులు మరో సారి తమ జట్టు టైటిల్ సాధించడంపై ఆశలు పెట్టుకునేలా చేసింది. చదవండి: IPL 2022: సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్ పాటిదార్..? RCB wins #IPL2022 Eliminator vs LSG Virat Kohli & DK lauded Rajat Patidar’s match winning knock, while the team enjoyed making it past the Eliminator stage. All that & more in Part 1 of the Game Day video from the dressing room.#PlayBold #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PlayOffs pic.twitter.com/ER8nW9jOgL — Royal Challengers Bangalore (@RCBTweets) May 26, 2022 తిలక్‌వర్మ (ముంబై ఇండియన్స్) ప్రతిభ, పట్టుదలకు తోడు కీలక సమయాల్లో ఎలాంటి ఒత్తిడినీ చూపించకుండా సాధికారికంగా, అనుభవజ్ఞుడిలా తిలక్‌వర్మ ఆడిన తీరు సునీల్ గావస్కర్, రోహిత్శర్మలాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకునేలా చేసింది. 2020 అండర్–19 వరల్డ్‌కప్‌లో భాగంగా ఉన్న హైదరాబాదీ తిలక్ కొద్ది రోజుల్లోనే అన్ని ఫార్మాట్లలో సత్తా చాటి సొంత టీమ్‌లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. వేలంలో రూ.1.7 కోట్లకు ముంబై అతడిని ఎంచుకున్నప్పుడు కూడా తుది జట్టులో అవకాశం లభిస్తుందా అనే సందేహాలు! అయితే తన అద్భుత ఆటతో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తొలి సీజన్లోనే టీమ్‌లో కీలక ఆటగాళ్లలో ఒకడిగా మారి భవిష్యత్తు తారగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 14 మ్యాచ్‌లలో 131.02 స్ట్రైక్‌రేట్‌తో 397 పరుగులు చేసిన తిలక్ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకునేలా చేశాడు. "Talking to Sachin sir, Rohit bhai and Mahela gave me a lot of confidence." 💯 Tilak caps off an excellent debut season with this honest chat about what he learnt and where he has improved 💪#OneFamily #DilKholKe #MumbaiIndians @TilakV9 MI TV pic.twitter.com/Qc3nQeTZJs — Mumbai Indians (@mipaltan) May 26, 2022 చదవండి: KL Rahul-Sanjay Manjrekar: 'కోచ్‌గా ఉండుంటే కేఎల్ రాహుల్‌ను కచ్చితంగా తిట్టేవాడిని' -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ మొహసిన్ ఖాన్..?
ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహసిన్ ఖాన్ అదరగొడుతున్నాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో విజయంలో మొహ్సిన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన మొహసిన్..16 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ కెప్టెన్ పంత్‌ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మొహసిన్ మలుపు తిప్పేశాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన మొహ్సిన్ ఖాన్.. 8 వికెట్లు సాధించాడు. ఎవరీ మొహసిన్ ఖాన్..? ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ యువ పేసర్‌ను ఐపీఎల్-2022 మెగా వేలంలో లక్నో రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో 2018 నుంచి 2020 సీజన్ వరకు ముంబై ఇండియన్స్‌కు మొహసిన్ ఖాన్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక దేశీవాళీ టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 17 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన అతడు 26 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 28 టీ20ల్లో 34 వికెట్లు సాధించాడు. చదవండి: IPL 2022: పృథ్వీ షాకు భారీ జరిమానా..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); An elated dugout as @LucknowIPL win by 6 runs against #DelhiCapitals.#TATAIPL #DCvLSG pic.twitter.com/EVagwBHHVA — IndianPremierLeague (@IPL) May 1, 2022


