'I am hoping he is watching' - Mohsin Khan dedicates match winning spell against MI to his father - Sakshi
Sakshi News home page

పది రోజులుగా మా నాన్న ఐసీయూలో ఉన్నాడు.. ఆయన కోసమే: లక్నో హీరో

May 17 2023 9:55 AM | Updated on May 17 2023 11:13 AM

Mohsin Khan dedicates match winning spell against MI to his father - Sakshi

ఐపీఎల్‌-2023లో అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు పేసర్‌ మొహ్సిన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. ముంబై విజయానికి ఆఖరి ఓవర్‌లో 11 అవసరమవ్వగా.. లక్నో కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా బంతిని   మొహ్సిన్‌ ఖాన్‌ చేతికి ఇచ్చాడు.

అయితే క్రీజులో టిమ్‌ డేవిడ్‌, గ్రీన్‌ వంటి పవర్‌ హిట్టర్లు ఉండడంతో ముంబై ఈజీగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే మొహ్సిన్‌ ఖాన్‌ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబైకు ఊహించని షాకిచ్చాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన మొహ్సిన్‌ ఖాన్‌ 26 పరుగులిచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు.

ఇక మొహ్సిన్‌.. ఈ అద్భుత ప్రదర్శను అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి అంకితం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు పది రోజులుగా మొహ్సిన్‌ తండ్రి ఐసీయూలో ఉన్నాడు. ఆ బాధను దిగమింగుతూ కూడా మొహ్సిన్‌ అద్భుతంగా రాణించాడు. ఈ విషయాన్ని మ్యాచ్‌ అనంతరం పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో మొహ్సిన్‌ వెల్లడించాడు.

"గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాను. మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్‌తో మైదానంలో అడుగుపెట్టాను. ఇది నాకు కష్టకాలం.  మా నాన్న పది రోజులు ఐసీయూలో ఉన్న తర్వాత నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు.  మా నాన్న ఈ మ్యాచ్‌ చూస్తున్నారన్న నమ్మకం ఉంది.

ఆయనకు ఈ ప్రదర్శనను అంకితం ఇవ్వాలని అనుకుంటున్నాను. మా జట్టు విజయంలో నావంతు పాత్ర పోషించింనందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి ఆఖరి ఓవర్‌ బౌలింగ్‌ చేసేందుకు అవకాశం ఇచ్చిన సపోర్ట్‌ స్టాప్‌కు ధన్యవాదాలు" అని మ్యాచ్‌ అనంతరం మొహ్సిన్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: లక్నో చేతిలో ఓటమి.. ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌ చేరాలంటే? అలా జరిగితే కష్టమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement