IPL 2023 Playoff Scenario: How Much Has The Defeat To LSG Affected Mumbai Indians Chances - Sakshi
Sakshi News home page

IPL 2023: లక్నో చేతిలో ఓటమి.. ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌ చేరాలంటే? అలా జరిగితే కష్టమే

May 17 2023 8:56 AM | Updated on May 17 2023 9:21 AM

How much has the defeat to LSG affected Mumbai Indians chances - Sakshi

ఐపీఎల్‌-2023లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే సువర్ణావకాశాన్ని ముంబై ఇండియన్స్‌ కోల్పోయింది. అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ముంబై ఓటమిపాలైంది. దీంతో ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలను ముంబై సంక్లిష్టం చేసుకుంది.

178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులకు పరిమితమైంది. రోహిత్‌ శర్మ(37), ఇషాన్‌ కిషన్‌(59) అద్భుతంగా రాణించినప్పటికీ.. విజయం మాత్రం లక్నో వైపే నిలిచింది.

ముంబై ప్లేఆఫ్స్‌కు చేరాలంటే?
అయితే ముంబై ఇండియన్స్‌కు ప్లేఆఫ్స్‌ చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఏడింట విజయం సాధించి నాలుగో స్థానంలో ఉంది. ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరగనున్న తదుపరి మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాలి. అప్పుడు ముంబై ఖాతాలో 16 పాయింట్లు ఉంటాయి.

అదే విధంగా ఇతర జట్ల ఫలితాలపై కూడా ముంబై భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు జట్లు కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాలి. అదే విధంగా ముంబై సన్‌రైజర్స్‌తో గెలిచి, ఆర్సీబీ, పంజాబ్‌ కూడా తమ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే మూడు జట్లు కూడా 16 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకమవతుంది. అటువంటి సమయంలో ముంబై మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉంటే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. 

ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ముంబై ఓడితే?
ముంబై ఇండియన్స్‌ తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే ఛాన్స్‌ ఉంటుంది. పంజాబ్‌, ఆర్సీబీ తము ఆడనున్న రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడిపోవాలి. అప్పడు 14 పాయింట్లతో మూడు జట్లు సమంగా నిలుస్తాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకమవతుంది.

ఇటువంటి సమయంలో రాజస్తాన్‌ నుంచి ఈ మూడు జట్లకు ముప్పు పొంచి ఉంటుంది.  రాజస్తాన్‌ తమ ఆఖరి మ్యాచ్‌ విజయం సాధిస్తే.. శాంసన్‌ సేన కూడా 14 పాయింట్లతో ముంబై, పంజాబ్‌, ఆర్సీబీతో సమంగా నిలుస్తుంది. అయితే రాజస్తాన్‌ నెట్‌రన్‌ ఈ మూడు జట్లకంటే మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. 
చదవండిఅదే మా కొంపముంచింది.. అస్సలు ఊహించలేదు! అతడు మాత్రం అద్భుతం: రోహిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement