సమంత లీడ్ రోల్లో వచ్చిన లేటేస్ట్ మూవీ మా ఇంటి బంగారం. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. జూన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్ స్టార్ వేదికగా సౌత్ భాషల్లో అందుబాటులో ఉంది.
తాజాగా మా ఇంటి బంగారం క్రేజ్ దృష్ట్యా మరో ఓటీటీకి వచ్చేసింది. సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ మూవీ హిందీ ఓటీటీ రైట్స్‌ను సోని లివ్ కొనుగోలు చేసింది. ఇక హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
Ek parivaar. Ek raaz. Aur ek bangaaram bahu, jo sab badal degi 🔥
Action Queen Samantha's Maa Inti Bangaaram (Hindi) is streaming now on SonyLIV pic.twitter.com/hyW4jWO7lm— Sony LIV (@SonyLIV) August 14, 2026


