ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు | Vinara O Vema and Gopi Galla Goa Trip OTT Streaming Now on Prime and Aha | Sakshi
Sakshi News home page

OTT: నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్

Aug 14 2026 3:18 PM | Updated on Aug 14 2026 3:20 PM

Vinara O Vema And Gopi Galla Goa Trip OTT Streaming Now

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. జగపతిబాబు 'వదలా', హార్టిన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫారెస్ట్ గార్డ్ లాంటి తెలుగు మూవీస్‌తో పాటు రష్మిక 'కాక్ టెయిల్ 2', కాటలన్, భారత భాగ్య విధాత, ఆరూపి లాంటి పరభాషా చిత్రాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటికి తోడుగా మరో తెలుగు మూవీ దాదాపు ఏడు నెలల తర్వాత అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి?

(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)

'పల్సర్ బైక్' పాటతో ఫేమస్ అయిన సింగర్ రమణ, ప్రశాంత్ ప్రధాన పాత్రలు చేసిన రూరల్ యాక్షన్ డ్రామా 'వినరా ఓ వేమ'. ఈ ఏడాది జనవరి 2న థియేటర్లలో రిలీజైంది. ప్రశాంత్ కల్యాణ్-రాజు మద్దెల సంయుక్తంగా దర్శకత్వం వహించారు. కంటెంట్ ఓ మాదిరిగా ఉండటం, స్టార్స్ లేకపోవడంతో దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడిది ఏడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.

గతేడాది నవంబరు 14న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'గోపీగాళ్ల గోవా ట్రిప్'.రోహిత్ & శశి దర్శకత్వం వహించగా అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పుడీ కామెడీ చిత్రం ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఉయిర్' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement