సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం తలైవా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ మూవీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో బిగ్ డీల్ కుదుర్చుకుందని సమాచారం. దాదాపు డిజిటల్ హక్కులను ఏకంగా రూ. 160 కోట్లకు చేజిక్కించుకున్నట్లు ఇన్‌సైడ్ టాక్. జైలర్ రైట్స్ రూ.100 కోట్లకు అమ్ముడవ్వగా.. సీక్వెల్ మరింత భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్నారు.
కాగా.. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, రమ్యకృష్ణ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
#Jailer2 sets a new benchmark with the biggest-ever OTT deal in Tamil cinema! 🔥
The previous record was held by #Coolie. pic.twitter.com/oSedexMvvR— Ramesh Bala (@rameshlaus) August 13, 2026


