కాంతార హీరోకు ప్రతిష్టాత్మక ‍అవార్డ్ | Kantara Hero Rishab Shetty Gets Best Director award | Sakshi
Sakshi News home page

Rishab Shetty: రిషబ్ శెట్టికి ప్రతిష్టాత్మక ‍అవార్డ్

Aug 14 2026 6:15 PM | Updated on Aug 14 2026 6:19 PM

Kantara Hero Rishab Shetty Gets Best Director award

కాంతార హీరో రిషబ్ శెట్టి మరో ఘనత సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ అందుకున్నారు. కాంతార ఏ లెజెండ్‌ చాప్టర్-1 మూవీకి గానూ బెస్ట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. అంతేకాకుండా లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డు కూడా దక్కించుకున్నారు.

ఈ అవార్డుల వేడుక ఆస్ట్రేలియా వేదికగా జరిగింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్-17 అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ దిగ్గజ నటి రేఖ ఎక్స్‌లెన్స్ ఇన్ సినిమా పురస్కారానికి ఎంపికయ్యారు. ఇండస్ట్రీలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీకి ప్రత్యేక గుర్తింపునిస్తూ సన్మానించారు. మరోవైపు దుల్కర్ సల్మాన్ , కీర్తి కుల్హరి, విజయ్ వర్మ, రసికా దుగల్‌ ఉత్తమ నటీనటులుగా అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. ఈ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా కొత్త లోకా చాప్టర్-1 నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement