'కొంచెమైనా సిగ్గుండాలి.. కూతురి వయసున్న అమ్మాయితో' | Govinda wife sunita says he having affair with woman his daughter age | Sakshi
Sakshi News home page

Sunita Ahuja: 'కొంచెమైనా సిగ్గుండాలి.. కూతురి వయసున్న అమ్మాయితో'

Aug 14 2026 7:31 PM | Updated on Aug 14 2026 7:58 PM

Govinda wife sunita says he having affair with woman his daughter age

బాలీవుడ్ నటుడు గోవిందా వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లు గోవిందాను వెనకేసుకొచ్చిన సునీత.. ఈ సారి మాత్రం గట్టిగానే కడిగేస్తోంది. ఇటీవల గోవిందా నటి  కోమల్ రాణి స్వర్ణకర్‌తో కనిపించడంతో సునీత ఫైరవుతోంది. తన కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడు.. గోవిందాకు కొంచెమైనా సిగ్గుండాలని ప్రశ్నించింది.

ఇటీవల ముంబయి విమానాశ్రయంలో గోవిందాతో పాటు నటి  కోమల్ రాణి స్వర్ణకర్‌ జంటగా కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇది చూసిన కొందరు గోవిందా భార్య సునీత అహుజాను ప్రశ్నించారు. దీంతో ఆమె తనదైన శైలిలో స్పందించింది. అసలు వీళ్లిద్దరు సినిమా తీయకుండానే ప్రమోషన్స్ చేస్తున్నారా? అంటూ మండిపడింది. అతను తన కూతురి వయస్సులో ఉన్న అమ్మాయితో తిరుగుతున్నాడు... కనీసం కొంచెమైన సిగ్గుండాలి కదా సునీత నిలదీసింది.

కోమల్ రాణి స్వర్ణకర్ ఎవరు?

కోమల్ రాణి స్వర్ణకర్ బాలీవుడ్‌లో ఎంట్రీకి సిద్ధమైంది. గోవింద ఇటీవలే 'రూపా', 'దునియాదారి' చిత్రాలను ప్రకటించారు. వీటిలో 'రూపా' చిత్రంలో రాణి స్వర్ణకర్‌ను కథానాయికగా పరిచయం చేశారు. ఈ ప్రాజెక్టులను గోవిందానే నిర్మిస్తున్నారు. దీంతో గోవింద రాబోయే రెండు ప్రాజెక్టులలోనూ ఆమె భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement