యాక్టర్‌ రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం.. | Rani Mukerji Receives Honorary Doctorate From La Trobe University | Sakshi
Sakshi News home page

యాక్టర్‌ రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం..

Aug 14 2026 6:45 PM | Updated on Aug 14 2026 7:09 PM

Rani Mukerji Receives Honorary Doctorate From La Trobe University

బాలీవుడ్‌ నటి రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్‌ యూనివర్సిటీ(La trobe University) ఆమెకు గౌరవ డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ పట్టాను ప్రదానం చేసింది. మెల్‌బోర్న్‌లో ఆగస్టు 14న జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
దాదాపు మూడు దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమకు అందించిన సేవలు, మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషిని గుర్తించి దీనిని అందజేశారు. అంతకముందు 2019లో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ ఈ గౌరవాన్ని అందుకున్నారు. దీంతో ఇప్పుడీమె ఈ డాక్టరేట్‌ అందుకున్న రెండో భారతీయ సినీ ప్రముఖరాలిగా నిలిచింది.

రాణి మాట్లాడుతూ సినిమానే నా కలను నిజం చేసే మార్గం అయిందన్నారు. కాగా ఈమె నటించిన ‘బ్లాక్‌’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘ హిచ్చి’, ‘మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ చిత్రాలు మహిళా సాధికారత, సామాజిక మార్పు వంటి అంశాలను ప్రతిబింబించాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement