సుహాస్ మండాడి.. క్రేజీ లవ్ సాంగ్ రిలీజ్ | Suhas MANDAADI Movie Telugu Lyrical Video song Out now | Sakshi
Sakshi News home page

Mandaadi Movie: సుహాస్ మండాడి.. క్రేజీ లవ్ సాంగ్ రిలీజ్

Aug 14 2026 9:12 PM | Updated on Aug 14 2026 9:13 PM

Suhas MANDAADI Movie Telugu Lyrical Video song Out now

సుహాస్, సూరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మండాడి. ఈ రా అండ్‌ రస్టిక్‌ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అందరినీ మెప్పించింది.  ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించారు.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. తెలుసా నీకే పిల్లా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ లవ్ సాంగ్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. కృష్ణ తేజస్వీ, రేష్మా శ్యామ్ ఆలపించారు. ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement