వెంకీమామకు 40 ఏళ్లు.. ఈ సారి దేశ రక్షణలో..! | Venkatesh role Revealed In ani ravipudi upcoming Movie | Sakshi
Sakshi News home page

VenkyAnil5: సంక్రాంతికి లెఫ్టినెంట్ కల్నల్.. వెంకీమామ పోస్టర్ అదుర్స్!

Aug 14 2026 8:01 PM | Updated on Aug 14 2026 8:25 PM

Venkatesh role Revealed In ani ravipudi upcoming Movie

వెంకీ మామ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు పూర్తయింది. కలియుడ పాండవులు మూవీతో వెండితెరపై అడుగుపెట్టిన వెంకటేశ్.. స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. యాక్షన్‌, లవ్‌తో పాటు కామెడీ జోనర్‌లో నటించారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన వెంకీమామ.. ఈ ఏడాది మెగాస్టార్ మూవీలో మెప్పించారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టారు వెంకటేశ్. వీరద్దరి కాంబోలో వస్తోన్న మూవీ.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. నేటికి వెంకీ మామ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని వెంకటేశ్ రోల్‌ను పరిచయం చేశారు. ఈ చిత్రంలో లెఫ్టినెంట్‌ కల్నల్ వెంకట్‌ రెడ్డిగా కనిపించనున్నారు. ఈ పోస్టర్‌ వెంకీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement