‘జబర్దస్త్’ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడ శాంతి స్వరూప్. తెరపై ఎప్పుడు లేడీ గెటప్‌లో కనిపిస్తూ..తనదైన కామెడీతో నవ్విస్తుంటాడు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. అయితే చాలా మంది ఆర్టిస్టుల్లాగే శాంతి స్వరూప్ కూడా ఎన్నో ఇబ్బందులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నాడు. తాజాగా ఓ న్యూస్ చానల్ నిర్వహించే టాక్ షోలో పాల్గొన్న శాంతి స్వరూప్.. తన పర్సనల్ లైఫ్‌తో పాటు సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
తాగి కక్కింది ఊడ్చేవాడిని
ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు నేను అనుభవించిన కష్టాలన్నీ గుర్తు చేసుకుంటా. తినడానికి తిండి లేక గుడిలోకి వెళ్లి ప్రసాదాలు తినేవాడిని. ఏ ఏ చర్చిలోకి వెళ్లి అన్నం తిన్నానో గుర్తు చేసుకుంటా. రెంట్ కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రూంలో ఉండేవాడిని. వాళ్లు తాగి కక్కితే ఊడ్చి ఎత్తేవాడిని.
నాన్న అంతక్రియలకు డబ్బుల్లేవు..
2007లో మా నాన్న చనిపోయాడు. అప్పుడు నేను అసిస్టెంట్‌గా చేస్తున్నా. తినడానికి ఏమి లేదు. అంత్యక్రియలు చేయడానికి రూ. 2000 కావాలి. నా దగ్గరు రూపాయి లేదు. మా ఐదు మంది అన్నదమ్ములు తలా ఇన్ని పైసలు వేసుకుంటున్నాను. నేను మా సార్‌కి ఫోన్ చేసి డబ్బులు అడుక్కొని అంత్యక్రియలు పూర్తి చేశా. నేను ఇప్పుడు ఉన్నట్లుగా ఉండి ఉంటే.. మా నాన్న ఇంకా బతికేవాడు’ అంటూ శాంతి స్వరూప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఫ్యామిలీ పోషించుకోవడం కోసం చీర, జాకెట్ కట్టుకున్నా
నేను రూమ్ రెంట్ కోసం వెళ్తే చాలా మంది ‘వద్దండి..లేడీ గెటప్స్’ఇవ్వలేం అంటారు. మేము కేవలం లేడీ గెటప్ మాత్రమే వేస్తున్నాం. ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలో తెలియనప్పుడు నేను ఈ చీర, జాకెట్ కట్టుకొని పైన విగ్గు పెట్టుకొని ఇలా ఉండబట్టే.. నా ఫ్యామిలీని పోషించుకోగలుగుతున్నా. నేనేం తప్పు చేయట్లేదే? చిల్లరపనులేవి చేయట్లేదు.
పెళ్లి చేసుకోను..
ఇదే ఇంటర్వ్యూలో ‘నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా?’ అని హోస్ట్ అడగ్గా.. ‘ఎవరినీ పెళ్లి చేసుకోను. నా లైఫ్ ఇలా ఉంది. లేడీ గెటప్‌లు వేసుకునేవాడివి అని వేరేలాగా అంటే వచ్చే వాళ్లకు బాధ అవుతుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లు రారు. కాళ్లు చేతులు బాగున్నంతవరకు కష్టపడతాను. ఒంట్లో బాగలేకపోయినా చూసేవాళ్లు ఎవరూ లేరు. నేనే క్యాబ్ బుక్ చేసుకొని ఆస్పత్రికి వెళ్లి వస్తాను. నాది ఒక దుర్భరమైన జీవితం. కాళ్లు చేతులు బాగున్నప్పడే, నిద్రలోనే చనిపోతే బాగుంటుందని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అంటూ శాంతి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అమ్మాయిలు చెడిపోయారు
ఇక ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘అమ్మాయి కానీ, అబ్బాయిలు ఏదో సాధించాలని ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. కొంతమంది అమ్మాయి అయితే ఫోన్ చేసి..‘నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్.. వచ్చేస్తా’ అని అగుతున్నారు. మీకు ఇబ్బంది అవుతుందని చెబితే.. ‘పర్వాలేదండి.. కమిట్‌మెంట్ ఇవ్వడానికైనా రెడీ’ వాళ్లే అంటున్నారు. డైరెక్టర్లు కూడా ‘నేను మీకు ఇస్తాను..నువ్వు నాకేమి ఇస్తావు’ అని అడుగుతున్నారు. అమ్మాయిలు పూర్తిగా చెడిపోతున్నారు. శని, ఆదివారం వస్తే.. హైదరాబాద్‌లోని ప్రతి పార్కు.. లవర్స్‌తో నిండిపోతుంది. పెళ్లి తర్వాత జరగాల్సిన పనులన్నీ పెళ్లికి ముందే అయిపోతున్నాయి’ అంటూ శాంతి అసహనం వ్యక్తం చేశాడు.


