విశ్వనాథ్ అండ్ సన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే? | kollywood star Suriya film Vishwanath and Sons box office Day 1 collection | Sakshi
Sakshi News home page

Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?

Aug 15 2026 1:02 PM | Updated on Aug 15 2026 1:18 PM

kollywood star Suriya film Vishwanath and Sons box office Day 1 collection

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌ తర్వాతే సూపర్ హిట్ అవుతుందని టాక్ వినిపించింది. రిలీజైన మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. 

మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్..అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.27.51 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియా వ్యాప్తంగా మొదటి రోజు రూ.15.15 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టగా.. రూ.17.51 ​​కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవర్‌సీస్‌లో రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీకి తమిళ వర్షన్ రూ. రూ.9.15 కోట్లు రాగా.. తెలుగులోనే రూ. 6 కోట్లు కలెక్ట్ చేసింది. 

కరుప్పు హిట్ తర్వాత సూర్య నటించిన మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం ఆగష్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement