ఈ వయసులో ఇలాంటి డ్రామా చేయడం సిగ్గుచేటు! | Heroine Trisha Sensational Comments | Sakshi
Sakshi News home page

ఈ వయసులో ఇలాంటి డ్రామా చేయడం సిగ్గుచేటు!

Aug 15 2026 8:15 AM | Updated on Aug 15 2026 8:21 AM

Heroine Trisha Sensational Comments

 సంచలనాలకు కేరాఫ్‌ నటి త్రిష అంటే అతిశయోక్తి కాదు. మోడలింగ్‌ రంగం నుంచి సినీ రంగంలోకి ఎంట్రి ఇచ్చిన ఈ మిస్‌ చెన్నై..  జోడి అనే చిత్రంలో నటి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో మెరిసి మాయమైయ్యారు. అలాంటి త్రిష ఇండియన్‌ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికిగా వెలిగి పోతాలని బహుశా ఆమే ఊహించి ఉండరు. ఆ తర్వాత తమిళం,తెలుగు చిత్రాల్లో నటిస్తూ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. 

కెరీర్‌ పరంగా రెండు దశాబ్దాలను అధిగమించినా ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌గా సత్తా చాటుతున్నారు. తాజాగా సూర్య సరసన నటించిన కరుప్పు చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో మరోసారి వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలోనే కార్తీకి జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే  ఇటీవల సినీ, రాజకీయ వర్గాల్లో పలు వివాదాల్లో చిక్కుకుని త్రిష వార్తల్లో నానుతున్నారు. అయినా తగ్గేదేలేదు అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 

అలా తాజాగా  చేసిన పోస్ట్‌ సంచలనంగా మారింది.  ఆమె ఏమన్నారంటే ‘‘ ఈ వయసులోనూ ఇంత నాటకం సిగ్గు చేటు. పోయి డబ్బు సంపాదించి ప్రశాంతంగా జీవించండి’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. త్రిష మాటల్లో అర్థం ఏంటి? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? అనే ప్రశ్నలను సంధిస్తున్నారు నెటిజన్లు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement