దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా లెల్లా రోహిత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. భైరవకాళి బ్యానర్‌పై లెల్లా రాహుల్ నిర్మిస్తున్న ఈ సినిమా 50 శాతం పూర్తయింది. నేడు (శనివారం) మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే. ఈ సందర్భంగా శుక్రవారం రిలీజ్ చేసిన మేఘాంశ్ శ్రీహరి కొత్త లుక్ పోస్టర్‌లో శ్రీహరి కూడా కనిపించారు. ‘‘తెలంగాణ సంస్కృతిలో భాగమైన పోతురాజు ఆహార్యంలో మేఘాంశ్ శ్రీహరి లుక్ అందర్నీ ఆకట్టుకుంది. త్వరలోనే ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.


