breaking news
Meghamsh Srihari
-
రియల్ స్టార్ శ్రీహరి తనయుడు హీరోగా ‘స్టూడెంట్’.. లుక్ అదిరింది
దివంగత రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘స్టూడెంట్’. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ రోజు ‘స్టూడెంట్’ సినిమా నుంచి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మేఘాంశ్ శ్రీహరి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. జామెట్రీ బాక్స్ లోని డివైడర్ ను క్లాస్ లో కాకుండా ఫైట్స్ కు ఉపయోగించడం, కాల్చిన సిగరెట్, అందంగా లవ్ లెటర్స్ రాయడం..ఇలా స్టూడెంట్ లో లైఫ్ లో భాగమైనవన్నీ ఈ పోస్టర్ లో కనిపించి ఆకట్టుకుంటున్నాయి. 'ధైర్యం ఉన్నవాడే తన వెంట అందరూ నడిచేలా చేసుకుంటాడు' అని రాసిన కొటేషన్ హీరో డేరింగ్ క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తుండగా.. 'ఈ భాను గాడు అంతా చూసుకుంటాడు, నువ్వు లవ్ చేయి, తన్మయ్ లవ్స్ భాను..' అని రాసిన మాటలు ఈ స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాలో ఉన్న పవర్ ఫుల్ లవ్ స్టోరీని చూపిస్తున్నాయి.‘స్టూడెంట్’ సినిమా మేఘాంశ్ శ్రీహరి కెరీర్ కు ల్యాండ్ మార్క్ మూవీగా రాబోతుందనే అంచనాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఏర్పడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. -
శ్రీహరి కొడుకు హీరోగా కొత్త సినిమా, టైటిల్ ఇదే
దివంగత ప్రముఖ నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటించనున్న కొత్త సినిమాకు ‘ఆస్మాన్’ అనే టైటిల్ ఖరారైంది. రామ్ నందన్ దర్శకత్వంలో కొండారు వెంకటేశ్, శ్రీకాంత్ మన్నెం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శనివారం జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ ఇవ్వగా, సందీష్ కిషన్ స్విచ్చాన్ చేశారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించగా, తొలి సన్నివేశానికి రామ్ నందన్ దర్శకత్వం వహించారు. విశ్వక్ సేన్, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ–‘‘రామ్ నందన్ అద్భుతమైన కథను చెప్పారు. మేం బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాం’’ అని చెప్పారు. ‘‘తెలుగులో నాకు ‘ఆస్మాన్’ తొలి చాన్స్. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌తో రాబోతున్నాం. మూడు షెడ్యూల్స్‌లోనే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేస్తాం’’ అని తెలిపరు రామ్ నందన్.‘‘మేఘాంశ్ శ్రీహరితో మా శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్స్‌లో తొలి సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీకాంత్ మన్నెం. ‘‘మూడేళ్ల క్రితం మా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశాం. అప్పట్నుంచి కథలు వింటూనే ఉన్నాం. కోడి రామకృష్ణగారి స్టూడెంట్ అయిన రామ్నందన్ మాకు ఈ కథను ఏడాది క్రితం చెప్పారు. ఆయన ఇది వరకే అరబిక్‌లో సినిమా చేశారు. ‘ఆస్మాన్’ సస్పెన్స్–థ్రిల్లర్‌గా ఉంటుంది’’ అని చెప్పారు వెంకటేశ్ కొండారు. కెమెరామెన్ షోయబ్ మాట్లాడారు. ఈ సినిమాకు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి.


