‘ఆస్మాన్‌’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. సింహాన్ని చూసినట్లు అనిపిస్తోంది: శాంతి శ్రీహరి | Srihari Son Meghamsh Srihari First Look Release From Aasmaan Movie | Sakshi
Sakshi News home page

శ్రీహరి కొడుకు హీరోగా ‘ఆస్మాన్‌’.. ఫస్ట్‌లుక్‌ అదిరింది!

Aug 16 2026 12:17 PM | Updated on Aug 16 2026 12:25 PM

Srihari Son Meghamsh Srihari First Look Release From Aasmaan Movie

మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా రామ్‌ నందన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆస్మాన్‌’. రాయంచ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, అరబిక్‌ భాషల్లో ఈ సినిమాను వెంకటేష్‌ కొండారు, శ్రీకాంత్‌ మన్నెం నిర్మిస్తున్నారు. శనివారం (ఆగస్టు 15) నటుడు శ్రీహరి జయంతి. ఈ సందర్భంగా ‘ఆస్మాన్‌’ సినిమా ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. 

ఈ కార్యక్రమంలో శ్రీహరి సతీమణి, నటి శాంతి శ్రీహరి మాట్లాడుతూ– ‘‘పగలు, రాత్రి అన్న తేడాల్లేకుండా మేఘాంశ్‌ వర్క్‌ చేస్తున్నాడు. శ్రీహరిగారు కూడా అలానే నటించేవారు. ఆర్టిస్టులు ఎప్పుడూ అలానే కష్టపడి నటించాలి. ఈ సినిమాతో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను. ఇప్పటికీ మేఘాంశ్‌ని చిన్నపిల్లాడిలానే చూస్తుంటాను. కానీ ఈ రోజు పోస్టర్‌ చూసిన తర్వాత సింహాన్ని చూసినట్లు అనిపించింది’’ అన్నారు. 

‘‘సెట్‌లో ఎప్పుడూ ఓ పండగ వాతావరణం కనిపించేది’’ అన్నారు మేఘాంశ్‌ శ్రీహరి. ‘‘ఆస్మాన్‌’ సినిమా ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తుంది’’ అని చెప్పారు రామ్‌ నందన్‌. ‘‘రియల్‌స్టార్‌ కొడుకు అంటే ఇలానే ఉంటాడనిపించేలా సెట్స్‌లో మేం అందరం ఆశ్చర్యపోయేలా యాక్ట్‌ చేస్తున్నాడు మేఘాంశ్‌’’ అని చెప్పారు వెంకటేష్‌ కొండారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ ఆర్‌ విహారి, కెమెరామేన్‌ షోయబ్, నటుడు రవివర్మ మాట్లాడారు. 

నాన్నలాగే నన్నూ ఆశీర్వదించండి: మేఘాంశ్‌ శ్రీహరి
స్వ‌ర్గీయ న‌టుడు శ్రీహ‌రి జ‌యంతి(ఆగస్ట్‌ 15) వేడుకలను ప్ర‌తీ ఏడాదిలాగానే బాచుప‌ల్లిలోని మండ‌పం ద‌గ్గ‌ర ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీహరి సతీమణి  శాంతి శ్రీహ‌రి, హీరో మేఘాంశ్ శ్రీహ‌రి, శ‌శాంక్ శ్రీహ‌రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ శ్రీహ‌రి మాట్లాడుతూ ‘ఈరోజు నాన్న‌గారి 62వ బ‌ర్త్ డే. ఆయ‌న జ‌యంతిని నిర్వ‌హించాం. నాన్న‌గారి జ‌యంతి సంద‌ర్భంగా నేను న‌టించిన ఆస్మాన్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశాం. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. నాన్న‌గారికి అంద‌రూ ఆశీర్వ‌దించిన‌ట్లే న‌న్ను కూడా ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’ అన్నారు.‘శ్రీహరి ఈరోజు మ‌న మ‌ధ్య లేక‌పోయినా ఎప్ప‌టికీ మ‌న హృద‌యంలోనే ఉంటాడు’అని శాంతి శ్రీహరి అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement