అవసరమైతే కండోమ్‌ యాడ్‌ కూడా చేస్తా : యష్‌ | Yash Breaks Silence On Toxic Song Trolling, Gives Witty Reply To Condom Ad Comparisons, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

కండోమ్‌ ప్రకటన చేస్తా.. కానీ ఉచితంగా కాదు: యష్‌

Aug 16 2026 11:48 AM | Updated on Aug 16 2026 12:48 PM

Yash Reacts To Toxic Song Being Compared To Condom Ad

కన్నడ స్టార్ హీరో యష్, బాలీవుడ్ నటి కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘తబాహీ’ పాట సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశమైంది. పాటలో యష్, కియారా అద్వానీ మధ్య కనిపించిన బోల్డ్ సన్నివేశాలపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు ఈ పాటను ఏకంగా కండోమ్ ప్రకటనతో పోల్చుతూ ట్రోల్ చేశారు. తాజాగా ఈ విమర్శలపై యష్ స్పందించారు.

ఓ టీవీ షోలో పాల్గొన్న యష్‌కు ‘తబాహీ’ పాటపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన తనదైన శైలిలో సరదాగా స్పందించారు. ‘అవసరమైతే కండోమ్ ప్రకటన కూడా చేస్తాను. కానీ అందుకు డబ్బులు తీసుకుని చేస్తాను. అలా ఉచితంగా చేయను’ అని యష్ వ్యాఖ్యానించారు. ఆయన సమాధానంతో కార్యక్రమంలో ఉన్న ప్రేక్షకులంతా గట్టిగా నవ్వారు. విమర్శలను సీరియస్‌గా తీసుకోకుండా హాస్యభరితంగా స్పందించడం ద్వారా యష్ ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చారు.


ఇక టాక్సిక్‌ చిత్రంలోని బోల్డ్‌ కంటెంట్‌ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా సాధారణంగా అందరికీ ఉద్దేశించిన కథ కాదని, పెద్దలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఫెయిరీ టేల్ అని ఆయన స్పష్టం చేశారు. ‘పిల్లలు ఇంట్లో ఉండాలి. ఈ చిత్రాన్ని చూడకూడదు’ అని ఆయన అన్నారు. దీంతో సినిమాలోని కంటెంట్ ఏ వర్గం ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారనే దానిపై మరింత స్పష్టత వచ్చింది.


గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement