అదృష్టం అంటే ఈ హీరోయిన్‌నే..పాతికేళ్లకే తిరుగులేని క్రేజ్ | From Premalu To Vishwanath & Sons, Mamitha Baiju’s Hit Streak Continues In Kollywood By Storm, Read About Her Journey Inside | Sakshi
Sakshi News home page

అదృష్టం అంటే ఈ హీరోయిన్‌నే..పాతికేళ్లకే తిరుగులేని క్రేజ్

Aug 16 2026 10:47 AM | Updated on Aug 16 2026 11:33 AM

Mamitha Baiju Got Another Super Hit With Vishwanath And Sons

ప్రస్తుతం కోలీవుడ్లో నటి మమిత బైజు టైమ్‌ నడుస్తుందనే చెప్పవచ్చు. వరుస విజయాలతో ఈ మాలీవుడ్‌ చిన్నది దూసుకుపోతోంది. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్‌ అని గ్రామానికి చెందిన డిగ్రీ కూడా పూర్తి చేయని మమిత బైజు ఇప్పుడు మలయాళం, తమిళం , తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా దూసుకుపోతోంది.

Actress Mamitha Baiju Cutest Photos1

బాల్యంలోనే  సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె మొదట్లో బాలనటిగా కొన్ని చిత్రాలు నటించింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే 2024 ఈ అమ్మడికి లక్కీ ఇయర్‌ అనే చెప్పాలి. ఆ ఏడాదిలో మలయాళం లో కథానాయకిగా నటించిన ప్రేమలు చిత్రం మమిత బైజు జీవితాన్నే మార్చేసింది. ఆ చిత్రం అనూహ్య విజయం తో మలయాళం లోనే కాకుండా తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమంలోనూ ఈమె పేరు మారుమ్రోగింది. ఇకపోతే అదే సంవత్సరంలో మమిత బైజు రెబల్‌ అని చిత్రంతో కోలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చింది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మమిత బైజు కు మాత్రం ఇక్కడ మంచి సక్సెస్ఫుల్‌ బాటను అమర్చింది.

ప్రేమలు బ్యూటీ మమితా బైజు క్యూట్ లుక్స్..(ఫొటోలు) | Actress Mamitha Baiju  latest photos | Sakshi

నటుడు ధనుష్‌ ,విజయ్‌ ,ప్రదీప్‌ రంగనాథన్‌ ,సూర్య వంటి స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలను పొందింది. తాజాగా జంటగా నటించిన విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో శుక్రవారం విడుదలై సక్సెస్‌ఫుల్‌ టాక్‌ తో ప్రదర్శింపబడుతుంది. ఈ చిత్రంలో మమిత బైజు నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ప్రతిభకు లక్కు తోడైతే అది మమిత బైజు లా ఉంటుంది అని కూడా అంటున్నారు. నటనకు అవకాశం ఉన్న పాత్రను ఎంపిక చేసుకుంటూ ఆయా పాత్రలో లీనమై నటించడం వల్లే ఈమె వరసగా సక్సెస్‌ అందుకుంటుందనే భావన సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తమిళం మలయాళం భాషలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ పాతికేళ్ల పరువాల భామ తమిళంలో నటుడు కార్తీకి జంటగా నటిస్తున్న చిత్రం నిర్మాణ దశలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement