బిగ్‌బాస్ సీజన్-10 మరికొద్ది రోజుల్లోనే బుల్లితెర ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. వచ్చే నెల నుంచే ఈ బిగ్ షో మొదలు కానుంది. ఇప్పటికే ప్రోమోలు రిలీజ్ చేయగా.. ఈ ఏడాది సీజన్‌పై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సీజన్ కోసం కంటెస్టెంట్ల వేట మొదలెట్టిన మేకర్స్ అగ్నిపరీక్ష పెట్టేశారు. ఈ పోటీలో ఫైనల్‌కు 15 మందిని ఎంపిక చేయగా.. వీరిలో హౌస్‌లో ఎవరు అడుగుపెడతారో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.
ఇదిలా ఉంటే ఈ అగ్నిపరీక్ష ఫైనల్‌కు చేరుకున్న వారిలో రైతుబిడ్డ, సింగర్ ఝాన్సీ కూడా ఉన్నారు. తమ పొలంలో పంట, రైతుల కష్టాలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. అలాగే తన పాటలతోనూ ఆకట్టుకున్నారు. అలా బిగ్‌బాస్ ఛాన్స్ కోసం అగ్నిపరీక్షలో ఫైనల్‌కు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలోనే సింగర్ ఝాన్సీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె కేవలం ఓ సింగర్ మాత్రమే కాదు.. చదువుల సరస్వతి కూడా. ఈ అగ్నిపరీక్షలో నవదీప్ ఆమెను చదువు గురించి అడిగారు. తాను పీజీలో ఆర్గానికి కెమిస్ట్రీ పూర్తి చేసినట్లు ఝాన్సీ వెల్లడించింది. తమ పొలంలో పనులు చేస్తూనే.. ఇంటర్‌లో ఏకంగా 926 మార్కులు సాధించినట్లు తెలిపింది. ఝాన్సీ టాలెంట్ చూసిన నవదీప్, బిందు మాధవి, యాంకర్ శ్రీముఖి ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


