అజిత్ కోసం వెంకీమామ ఎంట్రీ.. మోహన్ లాల్ కూడా..! | venkatesh and Mohan Lal Will Appears in Ajith Kumar Movie | Sakshi
Sakshi News home page

Ajith Kumar: అజిత్ కోసం వెంకటేశ్, మోహన్ లాల్..!

Aug 16 2026 7:52 AM | Updated on Aug 16 2026 7:52 AM

venkatesh and Mohan Lal Will Appears in Ajith Kumar Movie

కొత్తదనం లేకుంటే ఎంత పెద్ద స్టార్‌ నటించిన ఆ చిత్రాన్ని ప్రేక్షకులు నిర్దాక్షింగా పక్కన పెట్టేస్తున్న పరిస్థితి.  దీంతో ప్రముఖ స్టార్స్‌ కూడా తమ చిత్రాల్లో మంచి ప్యాడింగ్‌ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకు ఉదాహరణ నటుడు రజనీకాంత్‌. ఈయన జైలర్‌ చిత్రం నుంచి తనతో పాటూ ఇతర భాషలకు చెందిన స్టార్‌ హీరోలను అతిధి పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మరో స్టార్‌ హీరో అజిత్‌ కూడా ఆయన బాటలోనే పయనించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో  వైరలవుతోంది.

గతేడాది గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ వంటి కమర్షియల్‌ హిట్‌ చిత్రం తర్వాత అజిత్‌ తన దష్టిని కార్‌ రేస్‌ పోటీలపై మరలించారు. ఆ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలను గెలుచుకున్నారు. కాగా  ఆ సన్నివేశాలను విజయ్‌ చిత్రంగా మలిశారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం  గ్లాడియేటర్స్‌ ఇన్‌ పర్చూట్‌ ఆఫ్‌ ఛాలెంజర్స్‌ పేరుతో త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్‌ తన సతీమణి శాలినిని ప్రొడ్యూసర్‌గా పరిచయం చేస్తూ బ్రేవ్‌ హార్ట్స్‌ ప్రొడక్షన్‌ సంస్థను ప్రారంభించి డేర్‌ డెవిల్‌ అనే చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు.

దీనికి గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం ఫేమ్‌ ఆధిక్‌ రవిచంద్రన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం  సెప్టెంబర్‌లో  సెట్స్‌‌ పైకి  వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ ఒకే షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇకపోతే పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఇందులో టాలీవుడ్‌ స్టార్‌ నటుడు వెంకటేశ్.. మాలీవుడ్‌ స్టార్‌  మోహన్‌ లాల్‌ తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు  సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పుడుఈ టాపిక్ కోలీవుడ్‌లో ఆసక్తిగా మారింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement