రాహుల్ విజయ్, అర్చన జంటగా సాయి బాలి దర్శకత్వం వహించిన చిత్రం ‘అ’. కనకరావు తొనంగి, అభిషేక్ , ఎడిటర్ – డైరెక్టర్ గ్యారీ బీహెచ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు.
‘‘సాధారణ మిస్సింగ్ గర్ల్స్ థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది.


